కృష్ణా నది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైన సంగతి తెలిసిందే.  పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ తన వ్యాజ్యంలోనే పలుమార్లు పేర్కొన్న పిటిషనర్‌ ఈ భవనం అక్రమమా? కాదా? పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు అక్రమమేనంటూ అంగీకరించిన పిటిషనర్‌ అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని ప్రశ్నించిన హైకోర్టు ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామన్ని హైకోర్టు 2 వారాలపాటు కేసు విచారణ వాయిదా వేసింది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం ప్రభుత్వ వాదనలను పూర్తిగా సమర్థించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క విధి డాక్ట్రిన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రస్ట్‌ దేశంలోని న్యాయ వ్యవస్థలో ఒక భాగం ప్రకృతివనరులను భవిష్యత్‌ తరాలకు అందించడం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత 1997 సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ప్రస్తావించిన అడ్వకేట్‌ జనరల్‌ పర్యావరణాన్ని భంగపరిచేలా ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చి, ఆ విఘాతాన్ని తొలగించే బాధ్యత కోర్టులకు ఉందన్న ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలించేలా వ్యవహరించిన నిర్మాణదారుల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడం కూడా దీంట్లో భాగమే ప్రజావేదికను కూల్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లోనే కట్టడం అక్రమ నిర్మాణమన్న విషయాన్ని ప్రస్తావించారన్నారు. 

ప్రభుత్వం  కట్టడం అక్రమ నిర్మాణం అని పేర్కొని, అదే పిటిషన్‌లో కట్టడాన్ని కాపాడాలంటూ కోర్టును కోరడం ఆశ్చర్యకరమన్న ప్రభుత్వం అక్రమ నిర్మాణ చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణలనుంచి రికవరీ చేయాలన్న అంశంతో తానుకూడా ఏకీభవిస్తాననన్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణం తొలగించడమే కాదు, దాన్ని ఆ భవనానికి అయిన ఖర్చును రికవరీ చేయడం కూడా ఒక బాధ్యత అన్న రాష్ట్ర ప్రభుత్వం  మంచిని పెంచడానికి వ్యవస్థలు ఉండాలి కాని, మంచి పెంచే చర్యలను కట్టడానికి చేయడానికి వ్యవస్థలు ఉండకూడదన్న ప్రభుత్వం , తప్పులు జరగకుండా ఆపడానికి వ్యవస్థలు ఉండాలి తప్ప, ఆ తప్పును బలపరిచేలా చేయడానికి వ్యవస్థలు ఉండకూడదన్నారు.

ప్రభుత్వం ఒక్కరోజు అక్రమ నిర్మాణం ఉన్నా..., చట్ట విరుద్ధమే అవుతుందన్న ప్రభుత్వం పిల్‌లో ఎక్కడా ప్రజాప్రయోజనం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూల్చివేత సగం పూర్తయ్యిందని హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేత ఆపితే దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడానికి సిద్దంగా ఉన్నారని ఏజీ వాదనలు  మధ్యంలో ఆపడం తప్పే అవుతుందని వాదనలు  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, లోకాయుక్త నివేదికలను ప్రస్తావించిన ఏజీ  ఆదరాబాదరాగా కూల్చివేత నిర్ణయం తీసుకోలేదని వెల్లడి నిర్ధారిత నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్న ఏజీ  ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ  అక్రమ నిర్మాణానికి అయిన ఖర్చును రికవరీ చేయాలన్న అంశంపై విచారణను 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: