అవును మీరు చదువుతున్నది నిజమే..  ఎకరం భూమి ధర అక్షరాల 745 కోట్ల రూపాయలు.  ఇప్పటి ఈ ధర ఎక్కడో తెలుసా..  దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన  ముంబైలో ఇటీవల జరిగిన ఓ లావాదేవీ ఇది.బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లో  ఓ జపాన్ కంపెనీ 3 ఎకరాల భూమిని  2238 కోట్లతో కొనుగోలు చేసింది.

 

అంటే  ఎకరం 745 కోట్ల రూపాయలు అన్నమాట.  ఇప్పటివరకు  దేశంలో భూమి ధర విషయంలో ఇదే హైయెస్ట్ రికార్డ్.  రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది అత్యంత విలువైన ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. 

 

ఇక ముంబై లోని పాత రియల్ ఎస్టేట్ ఒప్పందాల విషయాన్ని పరిశీలిస్తే...  2010 సంవత్సరంలో వాడాలా ప్రాంతంలో..  ఎకరా భూమిని 653 కోట్ల రూపాయలకు లోధా కంపెనీ కొనుగోలు చేసింది.  మొత్తం 6.2 ఎకరాలను నాలుగు వేల 50 కోట్ల రూపాయలకు  ఈ కంపెనీ కొనుగోలు చేసింది. 

 

ప్రస్తుతం జపాన్ కంపెనీ కొనుగోలు చేసిన బాంద్రా కుర్ల కాంప్లెక్స్ ప్రాంతం ముంబై లోనే అత్యంత ఖరీదైనది.  దీని తర్వాత నారిమన్ పాయింట్,  కఫ్ పరేడ్   తర్వాతి స్థానాల్లో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: