పేరుకు మాత్రమే అది ప్రజా వేదిక. నిజానికి అది తెలుగుదేశంపార్టీ నేతలకు వేదికగా తయారైంది. అవసరమైనపుడు మాత్రమే ఉన్నతాధికారులతో సమావేశం అయ్యేవారు చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు. మిగిలిన సమయాల్లో పార్టీ నేతలతోనే సమావేశాలు జరిపేవారు.

 

పేరుకు మాత్రమే ప్రజావేదికైనా అది ఎక్కువగా టిడిపి వేదికగానే సేవలందించింది. శాసనసభాపక్ష సామవేశాలు, పార్టీ నతలతో సమావేశాలు, పార్టీ ముఖ్యనేతలతో సమీక్షలతో ప్రజావేదిక రోజు బిజిగా ఉండేది. పార్టీకంటూ పెద్ద వేదిక లేని కారణంగానే ప్రభుత్వ డబ్బులతోనే చంద్రబాబు పార్టీ కార్యకలాపాలకు ఓ వేదికను నిర్మించుకున్నారు.

 

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మామూలు జనాలను ప్రజావేదిక దాకా సెక్యురిటి అసలు రానిచ్చిందే లేదు. కాబట్టి జనాల నుండి చంద్రబాబు పిటీషన్లు తీసుకోవటం అన్నది అబద్ధం. కాబట్టి అది ప్రజావేదిక అనేకన్నా టిడిపి వేదిక అనటం సబబుగా ఉంటుంది. ఎన్నికల సమయంలో టిడిపిలో చేరికలంతా ప్రజావేదిక కేంద్రంగానే సాగిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

నిజానికి చంద్రబాబు తలచుకుంటే పార్టీకే కాదు సొంతానికి కూడా బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించుకోగలరు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ కాలంలో అసలు ఆ దిశగానే చంద్రబాబు ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే మరో 30 ఏళ్ళు టిడిపినే అధికారంలో ఉంటుందన్న గుడ్డినమ్మకం కారణంగానే పార్టీకి, సొంతానికి ఓ భవనాన్ని ఏర్పాటు చేసుకోలేదు.

 

కానీ చంద్రబాబు ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి అనుకున్నాడు. అందుకనే చంద్రబాబు ఆశలకు భిన్నంగా జరిగింది. అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యాంగా వ్యవహరించిన చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మాత్రం నిబంధనలు, ధర్మం, న్యాయం గురించి మాట్లాడుతున్నారు.

 

అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చేంత ధైర్యం చేస్తారని అనుకోలేదు టిడిపి నేతలు. ఇపుడు ప్రజావేదికను కూల్చేసిన జగన్ తర్వాత చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పే దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎందుకంటే అదికూడా అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలిసిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: