కరకట్ట అంటే  నదికి ఇరువైపుల నది ప్రవహించే ప్రాంతం నుండి 500 మీటర్ల  దూరంలో 20 నుండి 25 అడుగుల ఎత్తులో మట్టితో కడతారు.  ఇది చాలా బలంగా ఉంటుంది. 
గతంలో అంతే దాదాపు 20-25 ఏళ్ల క్రితం వరకు  3-4 ఏళ్ళకు ఒకసారి కరకట్ట అంచు వరకు వరద వచ్చిన ప్రతి సారి నీరు వచ్చేది. మా చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళేవాళ్లం... 
ప్రకాశం బారేజీ దగ్గర water flow కొలవడానికి ఒక ఇనప స్తంభం దానిమీద కుండ ఆకారంలో ఒక ఇనప ball లాంటిది ఉండేది.. 


కుండ మునిగింది అనే వారు ...  దాని అర్ధం తెలిసేది కాదు. తరవాత తెలిసింది ఏమంటే ఆ ball లాంటిది మునిగితే బారేజ్ దగ్గర  నీటి  ఎత్తు 24 అడుగులు ఉంది అని అర్ధం. 
ఇప్పుడు బారేజ్ దగ్గర 12 అడుగుల నీరు తప్పనిసరిగా maintain చేస్తున్నారు. అది కూడా VTPS కోసం నీరు pump చెయ్యడానికి. 
ఇక అసలు విషయానికి వస్తే .... google Map లో ... 


1 ఉన్న చోట అది నది ప్రాంతం ... అక్కడ నుండి కట్ట వరకు షుమారుగా ఉండే దూరం 500 మీటర్లు. 
2 వేసినది చంద్రబాబు గారు 2015 జనవరిలో ఇది అక్రమ నిర్మాణం కూల్చివేయ్యాలి అని నోటీసులు ఇచ్చిన ఇల్లు. 
3 చంద్రబాబు గారు వోటు కి నోటు కేసులో ఇరుక్కుని అర్ధరాత్రి పూట పారిపోయి వచ్చి ఇక్కడ చూపించిన ఇంటిలో కాపురం పెట్టాక ఆ కనిపిస్తున్న sheds వేశారు. వాటిని కొన్ని అధికారుల కోసం, security సిబ్బంది కోసం వాడుతున్నారు. 
4 మనం అంటున్న ప్రజావేదిక కట్టడం. రేపు చంద్రబాబు గారి నాటకం మనం అక్కడే చూడబోతున్నాము. 
అసలు problem ఏమంటే ... నదికి వరద వస్తే  ఈ బిల్డింగ్స్ అన్నీ ప్రవాహాన్ని ఆపుతాయి. ఆ ఒత్తిడి కరకట్ట మీద పది కరకట్ట కి గండి పడవచ్చు, లేదా బారేజీ మీద ఆ ప్రభావం పద వచ్చు. 
అందుకే ఈ పరివాహిక ప్రాంతంలో structures కి అనుమతి ఇవ్వరు. 


ఇవన్నీ పట్టా lands . గత 100 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు.  
వీటిని ఆక్రమించుకుని లేదా కొని అక్కడ ఒక guest house కట్టారు Lingamaneni.  అందులో రాత్రి 7 దాటిన తరవాత అన్నీ మంచి పనులే జరిగేవి. నమ్మండి. 
ఇందులో కాపురం పెడతా అంటే అనేక మంది వద్దు అన్నారు. కారణం ఆ బిల్డింగా లో జరిగే మంచి పనులే ..
మన నీళ్ళ శాఖ మంత్రి ఎవరో ఒక సిద్దాంతి ని తీసుకుని వచ్చి  చంద్రబాబు గారికి వాస్తు అని , ఇంటి ముందు నది పారుతుంటే రాజ యోగం వస్తుంది, వంశపారంపర్య యోగం వస్తుంది అని చెప్పారు. దీనితో చంద్రబాబు ఒప్పుకున్నారు. 


ఇక్కడ కూడా రాజకీయం చేశారు అప్పటి మంత్రి.  ఎవరో ఒకాయన ఇల్లు ఇస్తా అంటే ఎక్కడ చంద్రబాబు గారికి ఆయన close అయిపోతాడో అని ఈ నాటకం ఆడారు అన్న విషయం అందరికీ తెలుసు . 
ఇక ఆ కొంప లో జేరాక తీసుకున్న ప్రతి నిర్ణయం backfire అయింది. అక్కడ నుండే నామినేషన్ వెయ్యడానికి బయలుదేరి వెళ్ళిన లోకేశ్ ఓడిపోయాడు. ఆ కొంప లో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు .. 23 మందిని పార్టీలో జేర్చుకోవడం , అమరావతి  agreements అన్నీ అక్కడే చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: