ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సహా మంత్రి వర్గం అంతా  కోటీశ్వరులే నని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది.  మొత్తం మంత్రుల్లో 88 శాతం మంది కోటీశ్వరులు.  వీరిలో 510 కోట్ల రూపాయలతో  సీఎం జగన్  మొదటి స్థానంలో ఉన్నారు.

 

ఆస్తిపాస్తుల్లో జగన్ తర్వాత స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు.  ఆయన ఆస్తుల విలువ 130 కోట్ల రూపాయలు.  మంత్రివర్గంలో అప్పులు ఎక్కువగా ఉన్న మంత్రి కూడా ఈయనే.  పెద్దిరెడ్డి కి 20 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 

 

ఇక జగన్ , పెద్దిరెడ్డి తర్వాత 61 కోట్ల రూపాయల ఆస్తులతో మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.  జగన్ తో కలుపుకొని మొత్తం 26 మంది మంత్రు ల్లో  23 మంది కోటీశ్వరులు.  మంత్రుల సగటు ఆస్తి రూపాయలు. 

 

అప్పుల విషయానికి వస్తే పెద్దిరెడ్డి తర్వాత స్థానంలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు.   ఈయనకు 12 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి.  మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు కు ఐదు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.  ఇది జగన్ క్యాబినెట్ ఆస్తులు-అప్పుల గొడవ.

మరింత సమాచారం తెలుసుకోండి: