‘ఈ దేశ అభివృద్ధి నా ఒక్కడి వల్లే జరిగిందని నేను చెప్పుకోలేదు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ఎంతో ఉందని ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో చెప్పిన తొలి ప్రధానిని బహుశా నేనేనేమో..! ఇంతవరకూ జరిగింది చాలు.. ఇకనైనా నాపై ఈ ప్రచారాన్ని ఆపండి!’  అని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రె్‌సను ఉద్దేశించి లోక్‌సభలో అన్నారు. ‘‘ఏది చేసినా నెహ్రూ-గాంధీ కుటుంబమే.. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని నిలబెట్టింది వారే. ఇదే కాంగ్రెస్‌ నిరంతర స్మరణ. అని ఎద్దేవా చేసారు.

 

ఆ కుటుంబ సభ్యులు తప్ప వేరెవ్వరూ దేశాభివృద్ధికి కృషి చేయలేదా? అటల్‌ బిహారీ వాజ్‌పేయి మీకు గుర్తుకు రారెందుకు? పీవీ నరసింహారావు చేసిన మంచి పనులు మీకు తెలియదా? మన్మోహన్‌సింగ్‌ పేరును ఒక్కసారైనా తలచారా?’’ అని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండురోజులపాటు జరిగిన చర్చకు ఆయన మంగళవారంనాడు బదులిచ్చారు.

 

ముస్లింల అభ్యున్నతి కాంగ్రె్‌సకు అక్కర్లేదు. ముస్లింలను సంస్కరించే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీది కాదని తమ పార్టీ సీనియర్లే అన్నారని రాజీవ్‌ హయాంలో పనిచేసిన ఓ మంత్రి (ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌) అన్నారు. ముస్లింలు మురికిలో, బురదలో బతకాలనుకుంటే కానివ్వండి.. అని వారు పేర్కొన్నారు. షాబానో కేసులో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును పక్కనపడేయాలన్న నిర్ణయం తీసుకున్న సమయంలో ఈ మాట అన్నారు.

 

‘మాకు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారన్నది ముఖ్యం కాదు. తొలిసారిగా దేశప్రజలు గెలిచారు. వారు మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్నారు. ఆ స్ఫూర్తి కొనియాడదగినది. మీరు కలిసొస్తే ఇది సాధ్యమే.’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. దాంతో సభలో అందరు బల్లలు చరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: