మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ సంద్భంగా నేతలు గడప గడపకు తిరిగి వంగి వంగి దండాలు పెడతారు..మీ చల్లని దేవెన మాపై ఉండాలని..మేం గెలిస్తే మీ కష్టాలు తీరుస్తామని ఎన్నో వాగ్ధానాలు చేస్తుంటారు.  ఇక ఉపన్యాసాలైతే ఓ రేంజ్ లో ఉంటాయి..మీ కుటుంబంలో నేను భాగస్వామిని అవుతాను..మీ కష్టాన్ని నా కష్టంగా చూస్తాను అంటూ తెగ సొల్లు కొడుతుంటారు.  తీరా ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆటు వైపు కాదు కదా అసలు ఓటర్లు అన్న విషయమే మర్చిపోతుంటారు. 


ఇప్పటికీ దేశ వ్యాప్తంగా సరైన వైద్య సదుపాయాలు లేవని ఎన్నో వార్తలు, సోషల్ మీడియాలో ఎన్నో సంఘటనలు చూపించినా ఈ పాలకులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండదు.  ఆ మధ్య ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో సంఘటలు వెలుగు లోకి వచ్చాయి..తాజాగా ఇలాంటిదే మరో ఘటన బీహార్‌లోని నలందలో జరిగింది. కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన 8 ఏళ్ల కుమారుడిని ఓ వ్యక్తి నలందలోని సదర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. 


చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు..ఆ నిరుపేద తండ్రి ఇంటికి తీసుకువెళ్లడానికి తన వద్ద డబ్బు లేదని..అంబులెన్స్ సహాయం అడిగాడు..కానీ వారు తిరస్కరించారు. దాంతో  కొండంత బాధతో తన కుమారుడి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఇంటికి బయల్దేరాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ యోగేంద్ర సింగ్ దీనిపై విచారణ జరిపిస్తామని, సిబ్బంది తప్పుందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: