జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఎంత ఘోర పరాజయం పొందిందో తెలిసిందే. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవటంతో జనసేన పార్టీకి కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది. 120 స్థానాల్లో జనసేన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల్లో కనీసం 5 సీట్లైనా జనసేన పార్టీ గెలుస్తుందని భావిస్తే కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసినా ఏ ఒక్క స్థానంలోను గెలవలేకపోయాడు. 
 
ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. కొత్త ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయట్లేదు. కానీ పవన్ ఇన్ని రోజులు ఎందుకు నిశబ్దంగా ఉన్నాడో కారణం చెప్పాడు. కొత్త ప్రభుత్వం పనితీరును కొంత కాలం చూసి ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయబోతున్నానని పవన్ కల్యాణ్ చెప్పాడు. 
 
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల గడువు ఇస్తున్నానని ఈ 100 రోజుల పనితీరు చూసి ఆ తరువాత విమర్శలు చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ జగన్ తన నవరత్నాల్లోని హామీల్ని ఒక్కొక్కటి నిజం చేస్తున్నాడు. అన్ని పథకాలలో అవినీతి జరగకుండా చూస్తున్నాడు. ఏదైనా కొత్త ప్రభుత్వం పొరపాట్లు చేస్తే వెంటనే పవన్ కల్యాణ్ అందులోని తప్పులు చెబితే బాగుంటుంది. ఇలా 100 రోజులు అంటూ వేచి ఉండటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఎందుకు పవన్ కల్యాణ్ 100 రోజుల తరువాత జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తాడో చూడాలి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: