ప్రజావేదికను జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం కూల్చేసిన నేపధ్యంలో కొత్త ఇంటిని వెతుక్కోవటమే మేలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు గుంటూరు-విజయవాడకు తొందరగా చేరుకునే ప్రాంతంలో కొత్త ఇంటిని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని తెలుగుదేశంపార్టీ నేతలతో కూడా చెప్పారు.

 

కరకట్ట మీదున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ఖాళీ చేసేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవటంతో  అనువైన ఇంటి కోసం పెద్ద ఇంటిని వెతుకుతున్నారు. కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణం ప్రజావేదికనే కూల్చేసిన తర్వాత జగన్ తదుపరి టార్గెట్ తాను నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌసే అని చంద్రబాబుకు అర్ధమైపోయింది.

 

ప్రభుత్వ భవనాన్నే కూల్చేసిన జగన్ ప్రైవేటు భవనం విషయం ఉపేక్షిస్తారని చంద్రబాబు కూడా అనుకోవటం లేదు. అందుకనే కూల్చేసే పరిస్ధితి వచ్చే వరకూ ఉండటం కన్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖాళీ చేసేస్తే కనీసం పరువైనా దక్కుంతుందని చంద్రబాబు అనుకున్నట్లు సమాచారం.

 

రాజధాని పరిధిలోనే ఉన్న ఉద్ధండరాయునిపాలెంకు చెందిన కొందరు టిడిపి నేతలు చంద్రబాబుకు స్ధలం ఇవ్వటానికి ముందుకొచినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. చంద్రబాబు గనుక తనకు అవసరం అయినట్లు ఇల్లు కట్టుకునేట్లయితే అవసరమైన స్ధలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ముగ్గురు నలుగురు టిడిపి నేతలు చంద్రబాబుతో చెప్పారట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: