త‌న తోటి మంత్రిని ఆకాశానికి ఎత్తేసే క్ర‌మంలో ఏపీ మంత్రి పేర్ని నాని జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరు అత్యంత సన్నిహితులు. గతంలో వీరు వేర్వేరు పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటినుంచే వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఇక ఇప్పుడు వీరు పార్టీలు మారి వైసీపీ గూటికి చేరుకున్నారు.

తాజా ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని వరుసగా నాలుగో సారి విజయం సాధిస్తే... బంద‌రు నుంచి పేర్ని నాని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని అభినందన సభలో పేర్ని నాని మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు నటనలో మెళకువలు నేర్పడంతో పాటు.... ఓనమాలు నేర్పిన ఘనత కూడా కొడాలి నానీదే అంటూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఎన్టీఆర్ తండ్రి దివంగ‌త హ‌రికృష్ణ‌కు, కొడాలి నాని అత్యంత స‌న్నిహితుడిగా ఉండేవారు. ఎన్టీఆర్ గుంటూరులో చ‌దువుకున్న‌ప్పుడు కొడాలి నానీయే ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకునేవారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ తొలి సినిమా ఆది క‌థ చ‌ర్చ‌ల్లో కూడా నానీ ఉన్నారు. ఆ త‌ర్వాత నానికి ఎమ్మెల్యే టిక్కెట్ రావ‌డంలో ఎన్టీఆర్ సాయం చేశారు. నాని ఎమ్మెల్యే అయ్యాక ఎన్టీఆర్‌తో సాంబ సినిమా చేశారు. ఈ క్ర‌మంలోనే కొడాలి నాని వైసీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. త‌న మిత్రుడు అయిన కొడాలి నానిని పొగిడే క్ర‌మంలో పేర్ని ఏకంగా ఎన్టీఆర్ టాపిక్ తీసుకువ‌చ్చి మ‌రీ ఆకాశానికి ఎత్తేయ‌డం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: