ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కగా, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్కస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక పార్టీ ఘోర పరాజయం పాలవడం, అలానే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడంతో రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు, అలానే పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం వంటి అంశాలపై జనసేన అధినేత పవన్ నిశితంగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు అయన త్వరలో జిల్లాలవారీగా పార్టీ కమిటీలు మరియు వాటి సభ్యులను ఎంపికచేయనున్నారు. ఇకపోతే జనసేన ఘోర పరాజయం తరువాత ఆమధ్య కొన్ని వార్తలు పుకారయ్యాయి. అన్నయ్య చిరంజీవి గారి వలె పవన్ కూడా పార్టీని నడపలేక వేరొక పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది అనేది ఆ వార్తల సారాంశం. ఇక మరికొందరు అయితే పవన్ కు ఇంకా పూర్తిగా రాజకీయ అవగాహన రాలేదని, అలానే జనసేన ఇంకా ప్రజలకు పూర్తిగా దగ్గరకాలేదని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో వారు మళ్ళి, టిడిపి వంటి పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని అంటూ వార్తలు ప్రచారం చేయ సాగారు. అయితే వాటన్నిటినీ జనసేన నాయకులు మరియు క్యాడర్ కొట్టిపారేస్తోంది. 

నిజానికి తమ పార్టీ ప్రజల్లోకి బాగానే వెళ్లిందని, అయితే మధ్యలో కొన్ని లోపాల వలన పూర్తిగా ప్రజలకు చేరువకాలేకపోయాం అని అంటున్నారు. ఇక రాబోయే ఎన్నికలపై తమ అధినేత ఇప్పటినుండే గట్టిగా దృష్టి సారించడం జరిగిందని, అలానే ముఖ్యంగా తమ పార్టీని వేరొక పార్టీలో విలీనం చేయడం అనేది ఎప్పటికీ జరగదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో టిడిపితో కానీ లేదా వారొక పార్టీతో పొత్తు పెట్టుకుంటామా,లేక ఒంటరిగా పోటీ చేస్తామా అనేది తమ అధినేత నిర్ణయమని వారు అంటున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: