ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

 

తెదేపా ప్రభుత్వం దాదాపు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతుల్లేవని అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.  గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ దర్మకర్తలు లింగమనేని పూర్ణబాస్కరరావు, కుటుంబ సభ్యులు పవన్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. కొద్దిపాటి తొక్కిసలాటలు జరిగినా, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, కార్యక్రమం విజయవంతంగా పూర్తైయేలా సహాయకార్యక్రమాలు చేపట్టారు.  పూజ అనంతరం అక్కడినుండి వెళ్ళిపోతూ, అభిమానులు అండ్ కార్యకర్తలకు అభివాదం తెలుపుతూ వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: