ప్రజావేదికను కూల్చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో... కూల్చివేత కార్యక్రమం  కొనసాగింది. తొలుత ఈ భవనాన్ని నేడు కూల్చివేయాలని భావించారు కానీ అనూహ్యంగా మంగళవారం నుంచే కూల్చివేతకు సన్నాహాలు చేశారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా భవనాన్ని నేలమట్టం చేశారు.


ఈ ఉదయం వర్షం కురవడంతో, కూల్చివేత పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అధికారులు, కూలీలను తప్ప ఏ ఒక్కరిని పోలీసులు లోనికి ఎవరినీ అనుమతించలేదు. 


సీఆర్డీయే అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది.  గతంలో ఏ అధికారులైతే దగ్గరుండి ప్రజావేదిక నిర్మాణానికి పూనుకున్నారో అదే అధికారులు దగ్గరుండి భవనం కూల్చివేయించడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: