చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షాకులిస్తుంటే మరోవైపు సొంతపార్టీ నేతలే షాకులిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కాపు నేతలు డుమ్మా కొట్టారు. దాంతో పార్టీలో ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు.

 

చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో కాకినాడలో టిడిపిలోని కాపు నేతలు రహస్య సమావేశం పెట్టుకున్న విషయం సంచలనం కలిగించింది. కాపు నేతలు అందులోను మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ప్రత్యేకంగా కలవటంతో పార్టీలో కలకలం రేగింది.

 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాపు నేతలు బిజెపిలోకి జంప్  చేస్తారనే ప్రచారం విపరీతంగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయమై టిడిపిలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కాపు నేతల సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశానికి ఒక్క కాపు నేత కూడా హాజరుకాకపోవటంతో చంద్రబాబు షాక్ తిన్నారు.

 

విజయవాడలోనే ఉన్నప్పటికీ బోండా ఉమ, జ్యోతుల నెహ్రు, బూరగడ్డ వేదవ్యాస్ లాంటి కాపు నేతలు హాజరుకాలేదు. పైగా తమకు సమావేశంపై ఎవరూ సమాచారం ఇవ్వలేదని చెప్పటం విచిత్రంగా ఉంది. అదే సమయంలో మాజీ మంత్రి, కాపు నేత తోట త్రిమూర్తులు ప్రజావేదిక ముమ్మాటికి అక్రమ నిర్మాణమే అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: