ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర అధికారులు వ‌ద్ద‌న్నా..ప్ర‌ధానిని ఒప్పించి ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేసారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిపైన చ‌ర్య‌ల దిశ‌గా కీల‌క నిర్ణయం ప్ర‌క‌టించారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికితీసేందుకు మంత్రివ‌ర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. మొత్తంగా 30 అంశాల‌పై విచార‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, విద్యుత్ పీపీఏల్లో అక్ర‌మాలు జ‌రి గాయ‌ని..దీని పైన బాధ్య‌తుల‌తో పాటుగా అవ‌స‌ర‌మైతే నాటి సీఎం మీద లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.


ప్ర‌ధానిని ఒప్పించి మ‌రీ..!!
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దూకుడుగా ఉన్నారు. ఆయ‌న గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన పీపీఏల పైన తొలి నుండి సీరియ‌స్‌గా ఉన్నారు. పీపీఏల పైన స‌మీక్ష‌లు వ‌ద్ద‌ని..స‌మీక్షించి చ‌ర్య‌లు తీసుకుంటే..అవి వ్య‌తిరేక ప్ర‌భావానికి కార‌ణ మ‌వుతాయంటూ కేంద్ర అధికారులు నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ రాసారు. అయితే, ముఖ్య‌మంత్రి కేంద్ర అధికారులు అభ్యంత‌రం చెబుతున్న విష‌యాన్ని తిరుప‌తికి వ‌చ్చిన స‌మయంలో నేరుగా ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌ధాని సైతం త‌ప్పులు జ‌రిగి ఉంటే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని..అందులో రెండో ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో..వెంట‌నే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన సోలార్‌...విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ఒప్పందాల పైన ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. ఆ స‌మీక్ష‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా సీఎం గుర్తించారు. దీనికి బాధ్యులైన వారిపైన చ‌ర్య‌లకు ఆదేశించారు.


చంద్ర‌బాబుపైనా లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వా..??
ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనే వైయ‌స్ జ‌గ‌న్ నాటి ప్ర‌భుత్వం పీపీఏల పైన ఆందోళ‌న‌కు దిగారు. టీడీపీ ప్ర‌భుత్వం కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై జ‌గ‌న్ దృష్టి సారించారు. సోలావర్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. అదే స‌మ‌యంలో..కీల‌క అదేశా లు ఇచ్చారు. సోలార్.. విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహ రంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌టం సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది.


అవినీతి పైన స‌బ్ క‌మిటీ..!
టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మ‌రో కీలక నిర్ణయం తీసుకున్నా రు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సంస్థల సహకారం తీసుకోవాల‌ని అధి కారుల‌కు ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేసారు. దీంతో..ఇప్పుడు పీపీఏల పైన అధికారులు ఇచ్చిన స‌మాచారం అధారంగా లీగల్ చ‌ర్య‌లు ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌ధానంగా నాటి విద్యుత్ శాఖ ప‌ర్య‌వేక్షించిన కీల‌క అధికారులు..మంత్రి చిక్కుల్లో ప‌డిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. మ‌రి..నాటి సీఎం పాత్ర పైన ఏ ర‌కంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: