Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 7:11 pm IST

Menu &Sections

Search

కరకట్ట పై అక్రమ నిర్మాణాలన్నీ కూల్చడం సాధ్యమేనా?

కరకట్ట పై అక్రమ నిర్మాణాలన్నీ కూల్చడం సాధ్యమేనా?
కరకట్ట పై అక్రమ నిర్మాణాలన్నీ కూల్చడం సాధ్యమేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కృష్ణా నదీ కరకట్ట పై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయాలని నిర్ణయించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , అదే కరకట్ట పై నిర్మించిన ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చివేత కు ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తారన్నది ఇప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది . కేవలం ప్రజావేదిక కూల్చి వేసి మిగతా అక్రమ కట్టడాల జోలికి వెళ్లకపోతే మాత్రం తెలుగు తమ్ముళ్ల ఆరోపణలు అక్షరాల నిజమేనని నమ్మాల్సి పరిస్థితి నెలకొంటుంది .  అయితే ప్రజావేదిక కూల్చినంత సునాయాసంగా ప్రభుత్వానికి  ఇతర అక్రమ కట్టడాలు కూల్చడం సాధ్యం కాదన్న వాదనలు విన్పిస్తున్నాయి.


 కరకట్ట పై ఒక్క లింగమనేని గెస్ట్ హౌస్ మాత్రమే లేదని బీజేపీ నాయకుల అతిథి గృహాలు కూడా ఉన్నాయంటున్నారు.  మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కరకట్ట పై దాదాపు తొమ్మిది ఎకరాల విస్తీర్ణం లో అతిథి గ్రహాన్ని నిర్మించారు . ఈ భవనానికి ఎటువంటి అనుమతు లేకపోయినప్పటికీ , అధికారులు ఇన్నాళ్లూ ఏమి చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు . మరి కరకట్ట  అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతానంటున్న జగన్మోహన్ రెడ్డి , ఈ భవనం పై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది .


 అలాగే కరకట్ట పై వాణిజ్యవేత్తలు గెస్ట్ హౌస్ లు , ఆధ్యాతిక గురువులు  తమ  ఆశ్రమాలు నిర్మించుకున్నారు. వీటన్నింటిని కూల్చివేయాలంటే ప్రభుత్వానికి సవాలక్ష సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి . నదీ పరివాహక చట్టం ప్రకారం గరిష్ట వరద నీటి మట్టం లోపు ఎటువంటి కాంక్రీట్ నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు కానీ కృష్ణా , గుంటూరు జిల్లాల్లో కరకట్టకు అనుకుని పెద్ద సంఖ్యలో భవనాలు వెలిశాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూల్చివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది .


  ప్రజావేదికను కూల్చి వేసి ఇక తమ పని అయిపోయిందని జగన్ ప్రభుత్వం భావిస్తే మాత్రం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడం ఖాయం . కృష్ణా నదీ కరకట్ట చుట్టూరా వెలిసిన అక్రమ నిర్మాణాలు,  ఎంతటి వారివైన ఉపేక్షించకుండా కూల్చివేతలు చేపడితే మాత్రం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు  తప్పనిసరిగా మనసారా  అభినందిస్తారు .


jagan,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.