ముఖ్యమంత్రి జగన్ ఇపుడు పవర్ ఫుల్ గా ఉన్నారు. షాక్ కొట్టించడమే ఆయనకు తెలుసు. 151 అసెంబ్లీ సీట్లతో  ఆయన టీడీపీకి షాక్ తినిపించారు. మరో వైపు తనదైన దూకుడుతో అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా షాక్ తినిపించేస్తున్నారు.


అటువంటి జగన్ షాక్ తిన్నారట. అది కూడా రాజధాని భూముల వెనక ఉన్న చీకటి కధలు విని. ఒక్క శాశ్వత కట్టడం లేదు కానీ వేల కోట్ల రూపాయల నిధుల వరద పారించేశారు. సింగపూర్ కన్సార్టియం మొదలుకొని, కొన్ని ప్రైవేటు సంస్థలకు వేల  ఎకరాల భూములు కేటాయించారనే అంశం అధికారుల నోట విని జగన్ నిజంగానే షాక్ అయ్యారట.


ఇక తమవారు అనుకున్న వారికి అప్పనంగా వేలాది ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన వైనం తెలుసుకుని మరీ జగన్ మళ్ళీ షాక్ తిన్నారట. పాపాల పుట్టలా రాజధాని భూముల వ్యవహారం ఉందని జగన్ తెలుసుకున్నారు. అధికారుల నుంచి అందిన కీలక పత్రాలను  జగన్ పరిశీలించి ఆధారసహితంగా తెలుగుదేశం అక్రమాలను  తొందరలో బయటపెడతరట. మొత్తానికి జగన్నే షాక్ తినిపించేటంత అవినీతి అమరావతి భూముల్లొ చోటు చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: