పవన్ కళ్యాణ్ అటు సినిమాలు వదిలేశారు. ఇటు రాజకీయం దారి కనిపించడంలేదు. సినిమాల్లో ఉంటే అత్తారింటికి దారేదీ అన్నా దొరికేది. ఇపుడు రాజకీయాల్లో దారి మనమే వెతుక్కోవాలి. ఏ డైరెక్టరూ చూపించడు. రాజకీయం అన్నది  అంత తేలిక కాదు.


కానీ పవన్ తాను రాజకీయాల్లో కొనసాగుతానని అంటున్నారు. చాన్నాళ్ళకు బయటకు వచ్చిన ఆయన జగన్ సర్కార్ మీద తొలిసారి విమర్శ కాని విమర్శ చేశారు. నెల క్రితం ఎన్నికల్లో జనసేన ప్లేస్ ఏంటో జనాలు చూపించారు. దాన్ని చూసి దారి వెతుక్కోవాల్సిన బాధ్యత ఆ పార్టీ వాళ్ళదే కానీ పవన్ తీరు చూస్తూంటే ఇంకా వత్తాసు రాజకీయాలు మానడంలేదు అనిపిస్తోంది.


ప్రజావేదిక ఒక్కటే కూలిస్తే సరిపోదు, మొత్తం అక్రమ నిర్మాణాలు కూల్చాలని సవాల్ చేశారు. అంటే జగన్ కేవలం చంద్రబాబు మీద కక్షతోనే ప్రజావేదిక కూల్చారని కలరింగ్ ఇచ్చేందుకు పవన్ ప్రయత్నించారన్నమాట. నిజానికి లింగమనేని అక్రమ కట్టడంలో బాబు ఉంటున్నారు. ఆయన బాబుకు సన్నిహితుడు, 


ఇలా చాలా మంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రజల పక్షం, పర్యావరణ హితం పక్షం ఉంటే కనుక జై జగన్ అనాలి. కానీ కేవలం రాజకీయంగానే పవన్ చూశారనిపిస్తోంది. అందుకే జగన్ వైఖరి వెనక అయనకు కక్ష మాత్రమే కనిపిస్తోంది. అవును కదూ లింగమనేని పవన్ కి కూడా సన్నిహితుడే. అందుకే ఇలా మాట్లాడుతున్నరని అనుకోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: