- రాష్ట్రానికి తీవ్ర నష్టంగా రాష్ట్ర బీజేపీ నేతల తీరు
"ఊరందరిదీ ఒకదారైతే ఉలికిపిట్టది మరోదారి" అన్న చందంగా రాష్ట్ర బీజేపీ నాయకుల తీరు తయారైంది. రాష్ట్రంలోని సుమారు అన్ని పార్టీలు ప్రత్యేక స్టేటస్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నా , ఆ డిమాండ్‌ ముగిసిన అధ్యాయనంగా చెబుతూ ప్రజల దృష్టిని మరల్చాలని రాష్ట్ర బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. బీజీపీ నాయకుల మనుగడ ఆంధ్రాలో ముగిసిన అధ్యాయనంగా తేల్చేశారు. 


ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలుగా నష్ణపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్‌ కు వలస వెళ్లిన అనేకమంది తెలుగువారు తమ తెలివితేటలతో హైదరాబాద్‌ను దేశంలోనే రెండవ రాజదానిగా తీర్చిదిద్దారు. విధ్య, వైద్య, సాంకేతిక రంగాలలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధైన అనంతరం అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న కె చంద్రశేఖర్‌ రావు ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకోవాలనే ఆకాంక్షతో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని లేవనత్తారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2013లో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకుంది. అప్పటి వరకూ కూడబెట్టిన స్థిరాస్తులను పొందేందుకు వీల్లేకుండా ఆర్ధికంగా, ఉద్యోగ పరంగా ఆంధ్ర ప్రదేశ్‌ నష్టపోయింది. ఆంధ్ర రాష్ట్రం తిరిగి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు 15 ఏళ్ల పాటు స్పుషల్‌ స్టేటస్‌  ఇచ్చి తీరాలని బీజేపీ నాయకులు గొంతు పెంచారు.  
అదే డిమాండ్‌తో 2014లో కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన బీజేపీ నాయకులు మాటమార్చి స్ఫెషల్‌ ఫ్యాకేజ్‌ అంటూ అవినీతికి తాయిలం వేశారు. అనంతరం స్పెషల్‌ స్టేటస్‌ అనేది ముగిసిన అధ్యాయం అంటూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. దాని పర్యవసానంగా  ఆ పార్టీ మనుగడ ముగిసిన అధ్యాయనం అన్నట్టుగా 2019 ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాకుండా ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారు.  


రాష్ట్ర విభజన అనంతరం స్పేషల్‌ స్టేటస్‌ కోసం వైఎస్‌ఆర్‌సీపీ,  కాంగ్రస్‌ పార్టీ, వామపక్షాలు., తెలుగుదేశం చివరికి జనసేన పార్టీలు కూడా  ఉమ్మడిగా ఒక్కతాటిపై పెద్ద ఎత్తున స్పేషల్‌  స్టేటస్‌  కావాలని డిమాండ్‌ చేశాయి. పలు రూపాల్లో నిరసన తెలిపాయి. అయినప్పటికీ ఆంధ్ర బీజేపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారనే విమర్శలున్నాయి. సుమారు 5 కోట్ల ఆంధ్రులచే ఎన్నుకోబడ్డ  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికీ స్పెషల్‌ స్టేటస్‌ కోసం కేంద్రప్రభుత్వంతో పోరాటం చేస్తున్నా రాష్ట్ర బీజేపీ నాయుకులు ఇప్పటికీ ముగిసిన అధ్యయమే అనటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు దుయ్యబడుతున్నారు. కేంద్రం చెప్పినట్టు తలూపుతూ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్‌ స్టేటస్‌  సాధనలో రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఉనికిని కోల్పోతున్న పరిస్థితులు వచ్చినా ఇప్పటికీ కానుకోలేకపోవటం వారి అవివేకమని రాజకీయ విశ్లేషకులు  విమర్శిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: