ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతితో చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల పరువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ పరిశ్రమ కు విజయ నిర్మల చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

 

విజయ నిర్మల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  విజయనిర్మల కుటుంబానికి జగన్  ప్రగాఢ సంతాపాన్ని తెలి పారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన  విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని జగన్ అన్నారు. 

 

హైదరాబాద్ గచ్చిబౌలిలో కాంటినెంటల్ ఆసుపత్రి లో కన్నుమూసిన  విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు అంతా అక్కడివుంచి రేపు ఉదయం ఛాంబర్ కు తీసుకువస్తారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా  విజయనిర్మల అని పేరు మార్చు కున్నారు. ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్ని. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: