- సాకారమైతే రాష్ట్రంలో సందడే సందడి
తెలుపు రంగు రేషన్ కార్డులు వున్నవారు కష్టాలు తీరనున్నాయి. రేషన్‌షాపునకు వెళ్లకుండా ... సమయం వృధా కాకుండా నేరుగా లబ్దిదారులకు రేషన్  సరుకులు  ఇంటి వద్దకు తెచ్చి ఇచ్చే  రోజులు  రానున్నాయి.  అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ పలు సంస్కరణలు తీసుకొచ్చారు. అన్నింటా పారదర్శకతను  సాధించేందుకు అదేవరసలో రేషను సరుకుల  సరఫరాలో లోపాలను సరిచేసి,లబ్దిదారులకు న్యాయం చేకూర్చేందుకు జగన్ సిద్ధపడ్డారు. 


అంతేకాకుండా ఇప్పటివరకు  రేషన్ డిపోల్లో అందచేస్తున్న ముక్కిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యానికి  బదులు సంపన్నులకు అందుబాటులో ఉండే సన్నబియ్యాన్ని పేదలకు అందేలా నిర్ణయాలు తీసుకున్నారు. అదేపని మీద శ్రీకాకుళం చుట్టివచ్చారు. ఈ పథకం సెప్టెంబర్ నెలలో అమలులోకి వస్తుందన్నారు. డిపోలో పడిగాపులుకాసే  అవసరం లేదు. రేషన్ బియ్యం లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతుంది.
 
ఇప్పటి వరకు సరఫరా చేసిన పిడిఎస్‌ బియ్యం నాణ్యమైనవి కాకపోవడంతో చాలామంది లబ్ధిదారులు రేషన్ డిపోల నుంచి తీసుకు వచ్చిన బియ్యాన్ని బయట వ్యాపారస్తులకు అమ్మేస్తున్నారు. ఈ బియ్యాన్ని విక్రయించేవారు ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, సన్నబియ్యం పేరిట  అమ్మేవారు. ఈ సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం ఇవ్వడంతో ఆపని కుదరదు. ఇకపై అలా ఉండదని జగన్ పేర్కొన్నారు. ఈ పనితో ప్రతి నెల బియ్యం విడపించని  వారి సంఖ్య తగ్గుతుంది.   తూనిక సమస్య ఉండకుండా 5 కిలోలు 10కిలోలు 15కిలోలు ప్యాకింగ్ తో అందజేస్తారు . దీని వలన తూనిక తేడా రాదు , అలాగే నాణ్యతలో కూడా తేడారాదు. నేరుగా ఇంటివద్దనే బియ్యాన్ని అందచేయడం వళ్ళ ఇంటిలో ఎవరికీ నుంచునే అవసరం , వ్రేలుముద్ర వేసే అవసరం ఉండదని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: