గ‌త కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాతో స‌హా ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారిన అంశం మెగాస్టార్ చిరంజీవి పొలిటిక‌ల్ రీఎంట్రీ.  సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌లోకి ఎంటరై ప్రజారాజ్యం పార్టీని స్ధాపించారు. 2009 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కృషిచేశారు. కానీ కాలం కలిసిరాలేదు. 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆతర్వాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి కేంద్రంలో మంత్రి పదవిని కూడా చిరంజీవి అలంకరించారు. రాజకీయాలు కలిసిరాకపోవడంతో గత కొద్దికాలంగా దూరంగా చిరంజీవి ఉంటున్నారు. అలాంటి వ్య‌క్తి గురించి ఆస‌క్తిక‌ర వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.


ఏపీలో కాంగ్రెస్ క‌నుమ‌రుగు అవ‌డం, రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తితో చిరు బీజేపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చారు. చిరంజీవి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న త‌రుణంలోనే బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి వ్యక్తి బీజేపీలో చేరితే మేము సాదరంగా స్వాగతిస్తామని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాల‌నుకుంటే అది స్వాగ‌తించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. జులై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, అభిమానమున్న వారు పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకోవాలని కోరారు.


అయితే, మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ  రాజకీయాల్లోకి వస్తారని.. కానీ ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఆయన అభిమానులు మాత్రం తెగ బాధపడిపోతున్నారట. దయచేసి మా హీరోను వదిలేయండని వేడుకుంటున్నారట. గతంలో తిన్న ఎదురుదెబ్బల ద‌ృష్ట్యా చిరు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రావద్దని, ముఖ్యంగా బీజేపీలోకి వెళ్లొద్దంటూ మెగా ఫ్యాన్స్ విఙ్ఞప్తి చేస్తున్నారట. తమ హీరో కొందరివాడు కాదని.. అందరివాడని అంటున్నారు. చిరు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేక మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా అనేది తేలాలి అంటే..ఆయ‌నే స్పందించాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: