అమరావతి ఆంధ్రుల రాజధాని.  రాష్ట్రం విడిపోయాక అమరావతిని రాజధానిగా ప్రకటించారు.  అమరావతిని ప్రపంచంలో టాప్ నగరాల్లో ఒకటిగా నిలపాలని అప్పట్లో బాబుగారు కలలు కన్నారు.  అనేక డిజైన్లు తయారు చేయించారు.  డిజైన్లు, తాత్కాలిక భవనాల నిర్మాణంతో ఐదేళ్లు గడిచిపోయాయి.  


ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు.  రాజధానికంటే రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అని చెప్పి.. రైతుల దగ్గరి నుంచి తీసుకున్న భూములని తిరిగి ఇచేసేందుకు రెడీ అవుతున్నారు.  రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని అంటున్నారు. రాజధానిని పరిధిని కుదించి అవసరమైన భవనాల నిర్మాణం మాత్రమే చేపట్టి అక్కడే పరిపాలన చేయాలని అనుకుంటున్నారు.  


ఇందులో భాగంగానే రాజధాని నగరం పేరును కూడా మార్చాలని జగన్ అనుకుంటున్నారని సమాచారం.  గుంటూరులో భాగంగా ఉన్న తుళ్లూరులో రాజధానిని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.  రాజధాని పేరు మార్పు అంటే కుదురుతుందా.  


అది రాష్ట్రం చేతిలో లేని పని.  రాజధాని పేరు మార్చాలి అంటే కేంద్రం చేయాలి.  ఇలా పేర్లు మార్చడానికి కేంద్రం ఒప్పుకుంటుందా.. అయితే, కేంద్రంలో ఉన్నది జగన్ కు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అన్నది వైకాపా నేతల అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: