తెలుగుదేశం పార్టీ భారీ పరాజయంతో క్రుంగిపోయి ఉంది. ఆ పార్టీకి జవసత్వాలు కల్పించడం సరేసరి. ఉన్న పరిస్థితి అయినా ఉంటుందా అన్న బెంగ అందరిలోనూ ఉంది. అధినేత చంద్రబాబు, చినబాబు లోకేష్ తప్ప ఇప్పట్లో ఆ పార్టీకి వేరే నాయకత్వం లేదు. ఇక ఆ పార్టీలో కొత్త ముసలం పుడుతోంది.


ఏకంగా లోకేష్ నే తప్పించాలని తమ్ముళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారు. లోకేష్ పార్టీకి తీరని నష్టమని, ఆయన్ని పక్కన పెడితేనే పార్టీ గాడిలో పడుతుందని ఈ మధ్య కాకినాడలో సమావేశమైన మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లుగా వార్తాకధనాలు వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వీరంతా పార్టీలో కాపులకు పెద్ద పీట వేయాలని కోరుతున్నారు.ఇక ఇపుడు మరో అడుగు ముందుకేసి పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడుని కూడా తప్పించాలని కోరుతున్నారు


 యనమల వల్లనే పార్టీ దారుణంగా ఓడిపోయిందని అంటున్నారు. సొంత సీట్లో బలం లేని యనమలను పార్టీలో కీలకంగా చేయడం ఎందుకని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక తమ డిమాండ్లు అధినేత ముందు పెట్టి అంగీకరిస్తే సరే సరి, లేకపోతే వేరే దారి చూసుకుంటామని అంటున్నారు. మొత్తానికి అలవై కాని డిమాండ్లు ముందు పెట్టి తమ్ముళ్ళు సైకిల్ దిగిపోతారా అన్న డౌట్లు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: