అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా తన చేతికి వాచీ లేదని, వేలుకి కనీసం ఉంగరం కూడా లేదని చంద్రబాబునాయుడు బీదమాటలు చెప్పిన విషయం. కానీ మొన్నటి ఎన్నకల్లో ఎన్నికల సంఘానికి అందించిన అఫిడవిట్ల ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ రూ 668 కోట్లట. మరి వాచి, ఉంగరం కూడా లేని బీద వ్యక్తికి ఒక్కసారిగా రూ. 668 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?

 

చెప్పేదొకటి చేసేదొకటి అన్న విషయం చంద్రబాబు విషయంలో మరోసారి రుజువైంది. చంద్రబాబు ఆస్తులను అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ సంస్ధ బయటపెట్టింది. ఆ సంస్ధ బయటపెట్టిన వివరాల ప్రకారం ఏపి ఎంఎల్ఏల్లో అత్యంత ధనికుడు చంద్రబాబునాయుడేనట. రూ 668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు మొదటి స్ధానంలో నిలవగా తర్వాత స్ధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనట. జగన్ ఆస్తుల విలువ రూ 510 కోట్లని సంస్ధ తేల్చింది.

 

అధికారంలో ఉన్నపుడు ముందు చంద్రబాబు తర్వాత చినబాబు ప్రతీ ఏడాది వాళ్ళ కుటుంబ ఆస్తుల వివరాలు మీడియాకు ఇచ్చేవారు. సరే వాళ్ళిచ్చిన లెక్కలను దేశంలో ఎవ్వరూ నమ్మలేదు లేండి. ఆ లెక్కల్లో కూడా చంద్రబాబు ఆస్తుల విలువ చాలా నామమాత్రంగానే చూపేవారు. చంద్రబాబుకన్నా బుడ్డోడు దేవాన్ష్ ఆస్తులే ఎక్కువగా ఉన్నట్లు అప్పట్లో నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారేశారు.

 

తాను ఇచ్చిన లెక్కలను ఎవరూ నమ్మరని తెలిసి కూడా ఎవరేమనుకుంటే తమకేంటన్నట్లు లోకేష్ తప్పుడు లెక్కలనే  మీడియాకిచ్చేవారు.  మరి ఎన్నికల సందర్భంగా స్వయంగా చంద్రబాబే తన ఆస్తుల విలువ రూ. 668 కోట్లని చెప్పారంటే చెప్పని లెక్కల ప్రకారం ఇంకెంతుందో ?

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: