జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకునే నిర్ణయాలు చాలా వాడిగా ఉంటున్నాయి.  ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటున్నాడు జగన్.  అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పాడు.  అవినీతికి పాల్పడితే ఎలాంటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పేశారు.  


జ'గన్' ఎప్పుడు ఎవరిపై ఎలా గురిపెడతారో అర్ధంగాక భయపడుతున్నారు.  అటు అధికారులు సైతం జగన్ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు.  ఇదిలా ఉంటె, అవినీతి ఎక్కడ జరిగినా సరే ఎవరు చేసినా సరే నిర్ణయం మాత్రం ఒక్కటే.. తగిన శిక్షలు ఉంటాయని హెచ్చరించడంతో దాని జోలికి వెళ్ళడానికి జంకుతున్నారు అధికారులు.  


అటు పాలనలో తనదైన మార్క్ ను వేస్తూ.. ప్రతి శాఖలో ప్రక్షాళన చేస్తున్నారు.  కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై దృష్టిపెట్టిన జగన్.. వాటిని కూల్చివేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జరీ చేశారు.  జగన్ అవినీతి పరుడని గతంలో ప్రభుత్వాలు కేసులు పెట్టాయి.  


కానీ, ఇప్పటి వరకు ఒక్కటి కూడా రుజువు కాలేదు.  ఇప్పుడు జగన్ కు అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశాన్ని జగన్ వదులుకుంటాడా చెప్పండి.  ఎవరైతే అవినీతి పరుడు అని విమర్శలు చేశారో.. వారి అవినీతిని బయటకు తీసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇదే జరిగితే.. ఇక అంతే.  


మరింత సమాచారం తెలుసుకోండి: