- అక్రమార్కుల వక్రమార్గాల్లో  ఖరీఫ్‌ విత్తనాలు 
అన్నదాతలకు అన్యాయం జారకకూడదని ఒకపక్క ముఖ్యమంత్రి జగన అన్నిజాగ్రతలు తీసుకుంటున్నా మరొకపక్క కొందరు ఖరీఫ్‌ విత్తనాలను పక్కదారి పట్టిస్తున్నారు. అవసరమైన దానికన్నా ఎక్కువ సరఫరా అవుతున్నా కొన్ని పంచాయితులకు అవి అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆ వ్యవహారంపై ఆరా తీస్తే పక్క మండలాలకు తరలిస్తున్నారని తేలింది. 


 ప్రతి  ఏటా ఖరీఫ్ సమయంలో వరి విత్తనాలను  పంపిణీలలో   అంకెల గారడీ చేస్తూ  అక్కడ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. ఏ రైతు విత్తనాలకు ఇబ్బందిపడకూడదని అవసరమైన  దానికన్నాఎక్కువ  సరఫరా చేస్తున్నప్పటికీ కొరత ఏర్పడడం అవకతవకలకు అద్దం పడుతోంది.. ఇక్కడ వ్యవసాయాధికారులకు విత్తనాలు పంపిణీచేస్తున్నా అధికారుల మధ్య సమన్వయము లేకపోవడంతో  కొందరు విత్తనాలను దొంగదారులు పట్టిస్తున్నారు. 


వీరఘట్టం మండలంలో ప్రతి ఏటా  ఖరీఫ్ లో 15,100 ఎకరాలలో వారి సాగు చేస్తున్నట్లు ఘనకాలు చెప్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 1.20 ఎకరాలకు ఒక బస్తా (ముపై కిలోలు ) వారి విత్తనాలు అవసరం వుంది. లెక్క ప్రకారం 12,583 బస్తాలు అంటే 3,775 క్వింటాళ్ల వరి విత్తనాలు కావాలి. అయితే ప్రభుత్వం  ఇంతవరకు 11,800 బస్తాలను మాత్రమే పంపిణి  చేసింది. వీటితోపాటు ప్రైవేటు వ్యాపారులు కూడా  విత్తన బస్తాలను విక్రయించారు. 


కావాల్సిన దానికన్నా ఎక్కువ విత్తనాలను విక్రయించిన ఇంకా తమకు అందలేదని చలివేండ్ర, చిట్టుపూడివలస, దశుమంతపురం , మహాదేవివలస, ఇంకా కొన్ని ప్రాంతాల వారు భాదపడుతున్నారు. రైతులు విత్తనాలకు ఇబ్బందిపడకుండా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక  చర్యలు చెప్పట్టాలని ముఖ్యమంత్రి నుంచి జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక సూచనలు అందినప్పటికీ వీరఘట్టంలో పరిస్థితి ఏమీ మారలేదని రైతులు వాపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: