నందిగం సురేష్ ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక్కసారిగా జాతీయ స్థాయిలో బాగా హైలెట్ అయ్యింది ఈ పేరు. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం ఆయన తుళ్ళూరుకి చెందిన నందిగం సురేష్ అతి సాధారణ వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆయన స్వ‌యంగా తాను కూలి పని చేసుకుని జీవించాన‌ని.... అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీటు ఇచ్చి గెలిపించార‌ని చెప్పారు. దీనిని బట్టి సురేష్ ఎంత సామాన్యుడో అర్థం చేసుకోవచ్చు. ఎంపీ కాక‌ముందు వ‌ర‌కు సురేష్ చాలా సాధార‌ణ జీవితం మాత్ర‌మే గ‌డుపుతూ వ‌చ్చారు.


ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతో మంది రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించారు. ఈ క్రమంలోనే భూములు ఇవ్వని రైతుల చెరుకు తోటలు సైతం అప్పట్లో అధికార పార్టీకి చెందిన కొందరు తగలబెట్టటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై పోరాటం చేసిన నందిగం సురేష్‌ను టిడిపి నేతలు పోలీసుల ద్వారా భయపెట్టి బెదిరించారు. అయినా సురేష్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన పోరాటం చేశారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన సురేష్‌ను చాలా ఇబ్బందులు పెట్టారు.


సురేష్ ధైర్యసాహసాలకు మెచ్చుకున్న జగన్ ఈ ఎన్నికల్లో ఎవ్వరు ఊహించని విధంగా ఆయనకు ఏకంగా బాపట్ల ఎంపీ సీట్లు కేటాయించారు. సురేష్ టిడిపి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి పై సంచలన విజయం సాధించారు. విచిత్రం ఏంటంటే తన లోక్‌స‌భ పరిధిలో నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థులు విజయం సాధించినా... సురేష్ మాత్రం ఎంపీగా గెలుపొందారు. ఓ సామాన్య వ్యక్తిని లోక్ సభకు పంపిన ఘనత సొంతం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నందిగం సురేష్ కు మరో కీలక పదవి కట్టబెట్టారు.


వైఎస్ఆర్సిపి లోక్సభ పక్ష ఉపనేతగా సురేష్‌ను నియమించారు. అలాగే నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమించారు. ఎస్సీ వర్గానికి చెందిన అతి సాధారణ వ్యక్తిగా ఉన్న సురేష్‌కు ఈ స్థాయిలో గౌరవం లభించడంతో ఎస్సీ సామాజిక వర్గాలు మొత్తం జగన్మోహన్‌రెడ్డిని పార్టీలకు అతీతంగా ప్రశంసిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే బీసీ వ‌ర్గానికి చెందిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ను జ‌గ‌న్ పార్టీ విప్‌గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: