రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఎపుడు ఎవరు చేయి కలుపుతారో, ఎపుడు ఎవరు విడిపోతారో చెప్పమేం. అధికారమే పరమావధిగా రాజకీయం సాగుతుంది. దాని ముందు బంధాలన్నీ బలాదూర్. ఈ నేపధ్యంలో ఏపీలో అధికారంలో జగన్ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పోలిక ఒకటి ఉంది. అదేమంటే  తాజా ఎన్నికల్లో ఇద్దరూ బంపర్ మెజారిటీతో గెలిచారు.


ఇప్పటికైతే జగన్, మోడీ సన్నిహతంగా ఉంటున్నారు. ఏపీ అవసరాల‌ ద్రుష్ట్యా జగన్ కేంద్రానికి స్నేహ హస్తం చాస్తున్నారు. ఇక కేంద్రం కూడా ఏపీలో చంద్రబాబుతో వైరం మూలంగా జగన్ని చేరదీస్తోంది. అయితే ఈ కలయిక ఎక్కువ రోజులు సాగే అవకాశాలు లేవనే అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ మోడీని విభేదిస్తున్నారు. అలాగే ఏపీలో బీజేపీ బలపడడాని బలోపేతం చేసి జగన్ కి ధీటుగా నిలబడాలని కమలం కలలు కంటోంది.


ఈ పరిణామాల నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి తేవాలని బీజేపీ భావిస్తోంది. చిరంజీవికి ఇంకా చరిష్మా ఉందని ఆ పార్టీ అనుకుంటోంది. చిరంజీవి బీజేపీలో చేరితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు, ఏపీ బీజేపీ బాధ్యతలు కూడా అప్పగించాలనుకుంటోంది. ఒకవేళ చిరంజీవి రాకపొతే మాత్రం పవన్ని రంగంలోకి దింపాలను కూడా చూస్తోంది. పవన్  కు ఇపుడున్న పరిస్థితుల్లో జనసెన కంటే బీజేపీలో ఉంటేనే ఆయన కల సీఎం పదవిని అందుకోగలరని అంటున్నారు. మరి చూడాలి జగన్ని ఢీ కొట్టాలని ఉబలాటపడుతున్న బీజేపీ చర్యలను జగన్ ఎలా ఎదుర్కొంటారో.



మరింత సమాచారం తెలుసుకోండి: