చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి పై   విచారణ జరిపేందుకు..  ఏపీ సీఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే.  కమిటీ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.  ఈ కమిటీపై  తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.

 

జగన్ వేసిన కమిటీ లో మెజారిటీ సభ్యులు  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడాన్ని  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా తప్పు పట్టారు.రాజశేఖర రెడ్డి పాలనలో కళంకిత మంత్రులుగా ముద్రపడిన వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రులుగా ఉన్నవారు శ్రీరంగ నీతులు చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ అన్నారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే...

కోర్టు వాయిదాలకు హాజరయ్యే శుక్రవారం బ్యాచ్ అంతా ఒక కూటమిగా ఏర్పడి టిడిపి నేతలను అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారు. విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి...కమిటి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఒకే సామాజిక వర్గం వారిని నియమించడం రాజకీయ దురుద్దేశమే..

 

కేబినెట్ సబ్ కమిటి వేయడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయి.  ఎంపిలను ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ సబ్ కమిటిలో వేయడం దురుద్దేశ పూర్వక చర్య..విజయ సాయి రెడ్డి ఒక డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.స్వర్ణయుగాన్ని చీకటి పాలన అనడం జగన్మోహన్ రెడ్డి అవగాహనా రాహిత్యం. జగన్మోహన్ రెడ్డి తో సహా 26మంది కేబినెట్ లో 17మంది మంత్రులపై (65%) క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడిఆర్ నివేదిక వెల్లడించింది.9 మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 

 

151మంది వైసిపి ఎమ్మెల్యేలకుగాను 88మందిపై కేసులు ఉన్నాయి,వారిలో కూడా 50మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది.ఇటువంటి నాయకులను చుట్టూ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నీతిపాఠాలు వల్లె వేస్తున్నారు అంటూ యనమల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: