అడ్డగోలు విభజనకు ఏపీ  తీవ్రంగా నష్టపోయింది..  కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం..  16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో  పాలన ప్రారంభించాం..  ఇది అధికారంలో ఉన్నన్నాళ్లు మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన కబుర్లు...

 

ఈ మాటలకు, ఆయన చేతలకు  ఎక్కడ పొంతన లేకుండా పోయింది.  ఓవైపు  రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెబుతూనే... మరోవైపు రాష్ట్ర  ఖజానాను దుబారా ఖర్చులకోసం  ఖాళీ చేసి పారేశారు.  ఆయన పాలనలోని అడ్డగోలుతనం ఇప్పుడు బయట పడుతోంది.

 

అప్పట్లో చంద్రబాబు సర్కారు మంత్రులు అధికారుల కోసం యోగా కార్యక్రమం నిర్వహించారు.  ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ దీనికి హాజరయ్యారు.  ఈ కార్యక్రమం కోసం జరిగిన దుబారా చూస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే.

 

ఒక ఇడ్లీ,  గ్లాసుడు పాలు,   ఒక అరటిపండు..  వీటి కోసం 450 రూపాయల బిల్లు చేశారు.  ఇక ఒక భోజనం ఖరీదు 1350 రూపాయలు.  మొత్తము ఈ కార్యక్రమం కలదు కోటి 80 లక్షల రూపాయలు. ఇలాంటి దుబారా ఖర్చులు గడచిన ఐదేళ్లలో ఎన్ని ఉన్నాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి: