ఇటీవల కాళేశ్వరంపై అవాకులు చవాకులు పేలుతున్న నాయకులకు, ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా విమర్శిస్తున్న మేధావి జయప్రకాశ్‌ నారాయణ గారికి
'నమస్తే తెలంగాణ' దిన పత్రిక ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి ఇలా సామధానం చెప్పారు. ఈ స్సందన పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1 . గోదావరిలో నీటి లభ్యత ఉంది. సగటున ఏటా 2700 టీఎంసి ల నీరు బంగాళాఖాతంలో కలుస్తున్నది. రెండు రాష్ట్రాలకు కలిపి 1498 టీఎంసిల కేటాయించగా, తెలంగాణ సుమారు 960 టీఎంసిల నీటిని ఉపయోగించుకునే హక్కు కలిగి ఉంది. తెలంగాణకు ప్రత్యామ్నాయం ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాత గోదావరి నది నుంచి ఎత్తి పోయడం.
2 . ఇక కాళేశ్వరం అవసరం లేదని, అది దండగని, నీటి అవసరం తెలియని వారంతా మైకులు పట్టుకుని వాగుతున్నారు. తమ మిడి మిడి జ్ఞానాన్ని, తెలంగాణ ప్రభుత్వంపై అక్కసును, ద్వేషాన్ని రంగరించి సోషల్‌ మీడియాలో కుమ్మరిస్తున్నారు. నీరే ప్రాణాధారం. నీరే నాగరికతకు ప్రేరకం. ఆ నీరు లేకే తెలంగాణ ఇంత కలం గోసపడ్డది. ఆ నీటి కోసమే తెలంగాణ ఇవ్వాళ నడుము బిగించించింది. అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు.
3 . కాళేశ్వరం నుంచి 9 మాసాలపాటు నీటిని తోడుకునే అవకాశం ఉంది. రోజుకు రెండు నుంచి మూడు టీఎంసిల నీరును ఎత్తి పొసే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యవస్థను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా మరో 24 లక్షల ఆయకట్టుకు నీరిచ్చేదుకు ప్రణాళికలు రూపొందించారు. రెండు పంటలకు కోటి ఎకరాలు సాగులోకి తేవాలన్నది ఆశయం.
జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి చిన్న మెదళ్ళకు ఈ ప్రాజెక్టు విశ్వరూపం అర్థం కాదు. అర్థం అయ్యీ మాట్లాడితే అది కడుపుమంట అయి ఉండాలి. తెలంగాణ గడ్డపై సాగు నీరు, తాగు నీరు తేబోయే విప్లవం ఈయన గుర్తించలేకపోవడం ఒక విషాదం. ఎవరు ఎంత గొంతు చించుకున్నా కాళేశ్వరం సాధించబోయే గుణాత్మక ఫలితాల ముందు వీరంతా వెల వెలపోక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: