మాజీ మంత్రి నారా లోకేష్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. ఐటీ శాఖ మంత్రి గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడవేస్తున్నయి.  విశాఖ వేదిక జరిగిన అనేక కీలక నిర్ణయాల్లో అవక తవకలు ఉన్నట్టు తెలుస్తోంది.

 

చంద్ర బాబు సీఎం అయిన కొన్నాళ్లకు నారా లోకేష్ ఐటీ మంత్రి అయ్యారు. ఐటీ లో విశాఖను హైదరాబాద్ కు పోటీగా అభివృద్ధి చేస్తామంటూ తరచూ చెప్పేవారు. విదేశీ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థకు అడిగిన దానికంటే ఎక్కువ భూమి కట్టబెట్టారు.

 

ఈ విషయంలో అప్పటి సీ ఎస్ సిఫారసు లను పూర్తిగా పక్కకు పెట్టారట. Fintech vally పేరుతో నారా లోకేష్ ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. వీటి కోసం కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేశారు.

 

ఐటీ టవర్స్ నిర్మాణంలోనూ అంచనాలు భారీ గా పెంచారట. అనేక ఐటీ కంపెనీలకు భారీగా రాయితీలు ఇచ్చారట. ఇప్పుడు ఈ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: