జమిలి ఎన్నికలు ఇదీ ఇపుడు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల పట్టుదల. దీని కోసం గత అయిదేళ్ళలో అనుకున్నా కుదరలేదు. మెజారిటీ సరిగ్గా లేకపోవడం, ప్రతిపక్షాలు బలంగా ఉండడం  వంటి కారణాలతో ఆ ప్రతిపాదన ఆగింది. అయితే ఇపుడు మాత్రం మోడీ షా ద్వయం ఒకే దేశం, ఒకే ఎన్నికల విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు.


బీజేపీకి లోక్ సభలో బండ మెజారిటీ ఉంది. రాజ్యసభలో  మాత్రం విపక్షాలదే పై చేయి. అందువల్ల 2021 నాటికి బీజేపీకి పూర్తి మెజారిటీ రాజ్య‌సభలో కూడా వస్తుంది. అపుడే తన మనసులో  ఉన్న ఆలోచనలకు పదును పెట్టి దేశంలో  కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీజేపీ రెడీ అవుతుందని అంటున్నారు.


అందులో భాగంగా జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా బీజేపీకి వీలు చిక్కుతుంది. అదే కనుక జరిగితే ఏపీతో సహా దేశమంతా ఒకేమారు ఎన్నికలు జరుగుతాయి. 2022 చివర్లో కానీ 2023 మొదట్లో కానీ దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఒకేసారి లోక్ సభ, దేశంలోకి అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు పెడతారన్నమాట. 


అవిధంగా చేస్తే ఏపీలోని జగన్ సర్కార్ ఏడాదిన్నర కాలం అధికారాన్ని ముందే కోల్పోయి ఎన్నికలకు సిధ్ధం కావాల్సిఉంటుంది. ఇక అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో అన్న అవేదన లేకుండా టీడీపీకి కూడా మూడున్నరేళ్ళలోనే మళ్ళీ అధికారం కోసం పోరాడే అవకాశం లభిస్తుంది. మరి జమిలి ఎన్నికలు తోసుకు వస్తున్న వేళ ఏపీ తో సహా దేశంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఏంటో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: