మొన్నటి వరకూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగిన చంద్రబాబు విచిత్రమైన పరిస్ధితుల్లో ఇరుక్కుపోయారు. తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో కానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.  ఉమ్మడి ఏపిని దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ళ పాటు ఏలిన చంద్రబాబుకు ఇటువంటి పరిస్ధితి రావాల్సింది కాదు. అయినా వచ్చిందంటే అందుకు చంద్రబాబు స్వయంకృతమనే చెప్పక తప్పదు.

 

2014లో సిఎం కాగానే చాలా విచిత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్ధిగా కాకుండా శతృవుగా చూశారు. అసెంబ్లీలో కానీ బయటగాని జగన్ ను ఎన్నో విధాలుగా అవమానించారు. దాంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారిపోయింది.

 

ఎప్పటికి టిడిపినే అధికారంలో ఉంటుందని తన తర్వాత కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారన్న గుడ్డి నమ్మకంతోనే చంద్రబాబు కళ్ళు మూసుకుపోయి జగన్ ను ప్రధాన ప్రతిపక్ష నేతగా చూడటానికి కూడా ఇష్టపడలేదు. దాని ఫలితమే ఇపుడు చంద్రబాబు అనుభవిస్తున్నాడు.

 

ఇక తెలంగాణ విషయం తీసుకుంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే కెసియార్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారు. దాని ఫలితంగానే ఓటుకునోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారు. అప్పటి నుండి చంద్రబాబు అంటేనే కెసియార్ మండిపోతున్నారు. తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది.

 

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఇపుడు కెసియార్, జగన్ మధ్య ఇరుక్కుని నానా అవస్తలు పడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా కెసియార్, జగన్ ఏకమైపోయారు.  ఓటుకునోటు కేసుల్లాంటి వాటి వల్ల హైదరాబాద్ లో ఉంటే ఓ తలనొప్పి. ఐదేళ్ళ పాలనలో జరిగిన అవినీతిని జగన్ తవ్వి తీయటం వల్ల ఏపిలో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు చంద్రబాబు. మరి చంద్రబాబు కష్టాలు ఎలాగ తీరుతాయో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: