దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి గురించి తెలియని తెలుగువారుండరు అనే చెప్పాలి. ఇక 2004కు ముందు రాష్ట్రమంతా కలియతిరుగుతూ పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డిగారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ప్రజలు ఆ ఎన్నికల్లో మంచి మెజారిటీ కట్టబెట్టారు. ఇక మొక్కవోని దీక్షతో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకుఎళ్లిన రాజశేఖర్  రెడ్డిగారు, తదుపరి 2009లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ, మరోవైపు టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం వంటి పార్టీల కలయికలో ఏర్పడ్డ మహాకూటమి ఉన్నపటికీ, ప్రజలు మాత్రం రాజశేఖర్ రెడ్డిగారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కే మరొక్కసారి 2009లో పట్టం కట్టడం జరిగింది. 

అయితే ఆ తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెండంతో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిగారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అయితే ఆపై కొన్నాళ్ళకు రాష్ట్రం విడిపోవడం, తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని చేపట్టి ముందుకు సాగడం జరిగాయి. ఇక తండ్రి మరణాంతరం 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పిన అయన తనయుడు వైఎస్ జగన్, 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, మొన్నటి 2019 ఎన్నికల్లో మాత్రం అద్భుత విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇకపోతే ఆయన కూడా కొన్నాళ్ల క్రితం రాష్ట్రం మొత్తం ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఒక ఏడాది పాటు పాద యాత్ర చేసారు. ఇక ప్రస్తుతం అధికారాన్ని చేపట్టిన తరువాత, ఏ మాత్రం విశ్రమించకుండా, ప్రజల సంక్షేమం మరియు అభివృద్దే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. 

ఇక ఇటీవల తాము ఎన్నికల సమయంలో తమ మ్యానిఫెస్టోలో నెలకొల్పిన నవరత్నాలు పూర్తిగా అమలు చేసేవరకు తమ ప్రభుత్వం కానీ, తాను కానీ, అధికారులు, మంత్రులు సహా ఎవ్వరూ నిద్రపోరని అయన ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే ఇప్పటికే మెల్లగా ఒక్కొక్క ప్రజాసంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న జగన్ గారు, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాకర్షక పథకాలు, ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రవేశపెట్టడం జరుగుతుందని వైసిపి శ్రేణులు అంటున్నాయి. ఇక ప్రస్తుతం జగన్ గారిని చూస్తుంటే అప్పట్లో అయన తండ్రి వైఎస్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్, 108, డ్వాక్రా రుణాల పథకాలు గుర్తుకు వస్తున్నాయని, ఇక జగన్ గారు కూడా ఈ పథకాలపై అతి త్వరలో దృష్టిపెట్టి అందరికి మేలు చేకూర్చడం ఖాయమని, ఎంతైనా ఆయన తండ్రికి తగ్గ తనయుడిని అంటున్నారు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: