బెంగాల్‌లో రాజ‌కీయం రోజు రోజుకు హాట్ హాట్‌గా మారుతోంది. అక్క‌డ అధికార తృణ‌మూల్‌ను గ‌ద్దె దింపేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సినీన‌టి  మిమి చక్రవర్తి లోక్‌సభలో ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె నియోజ‌క‌వ‌ర్గం అయిన జాధ‌వ్‌పూర్‌లో టీఎంపీ కార్య‌క‌ర్త‌లు ఓ పార్టీ ఏర్పాటు చేశారు.


ఈ పార్టీలో లేడీ డ్యాన్స‌ర్ల‌తో అశ్లీల నృత్యాలు చేయించారు. డ్యాన్స్‌లో భాగంగా యువతి అసభ్యకరమైన దుస్తులను వేసుకొని అదే పనిగా అక్కడి యువకులను రెచ్చగెట్టే రీతిలో ప్రదర్శన చేసింది. ఆమె ప‌దే ప‌దే అశ్లీల భంగిమ‌ల‌తో యువ‌కుల‌ను రెచ్చ‌గొట్ట‌డంతో వారంతా ఓ రేంజ్‌లో ర‌చ్చ ర‌చ్చ చేశారు. అధికార పార్టీ ఎంపీ గెలుపు విజ‌యోత్స‌వాల్లో యువ‌తుల‌తో అశ్లీల నృత్యాలు చేయించ‌డంపై ప్ర‌త్య‌ర్థి పార్టీలు భ‌గ్గుమంటున్నాయి.


లేడీ ఎంపీని అభినందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో రికార్డు డ్యాన్స్‌ల పేరిట అశ్లీల నృత్యాలా ? అని వారు మండిప‌డుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆశించిన మేర రాక‌పోవ‌డంతో వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆదేశాలు జారీ చేసినా... టీఎంసీ కార్య‌క‌ర్తుల మాత్రం ఆమె ఆదేశాలే భేఖాతార్ చేస్తూ ఈ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ అశ్లీల వీడియోలు కొంద‌రు యువ‌కులు ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: