అనుకున్నామని జరగవు అన్ని..  అనుకోలేదని ఆగవు కొన్ని..   జరిగింది అంతా మన మంచికే అనుకొని ముందుకు సాగడమే మనిషి పని...  జగన్ పరిస్థితి చూస్తే ఈ సినీ గీతం గుర్తుకు వస్తుంది.  సీఎం కాగానే నా అనుకున్న వాళ్ళకి మంచి పోస్టులు ఇవ్వాలని  జగన్ భావించాడు.

 

అనుకున్నట్టే చాలామందికి మంచి పదవులు ఇవ్వగలిగాడు.  కానీ ఒకరిద్దరు విషయంలో మాత్రం  సాధ్యపడలేదు.  అందులో ఒకరు స్టీఫెన్ రవీంద్ర.   తెలంగాణ క్యాడర్ లో ఉన్న  ఈ ఐపీఎస్ ఆఫీసర్ ను ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ చేద్దామనుకున్నాడు జగన్.

 

ఎలాగూ కేసీఆర్ మన దోస్త్  కదా.. అని అడిగి చూసాడు.  కెసిఆర్ కూడా అడిగిందే తడవుగా ఓకే చెప్పేసాడు.   ఇంకేముంది స్టీఫెన్ రవీంద్ర ఇంటలిజెన్స్  చీఫ్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు.

 

కానీ అనూహ్యంగా ఈ ప్రతిపాదనకు కేంద్రం అని చెప్పింది. స్టీఫెన్ రవీంద్రను  తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పంపించడానికి తగిన కారణాలు కనిపించడం లేదంటూ అడ్డుపుల్ల వేసింది. రవీంద్ర ఫైలును పక్కకు పడేసింది.  దీంతో జగన్ ఎంతగా ప్రయత్నించినా...  స్టీఫెన్ రవీంద్ర ఏపీకి  రప్పించాలన్న ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: