ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబును   టార్గెట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు.  చంద్రబాబు  కట్టించిన ప్రజావేదికను   కూల్చడం తో పాటు....  చంద్రబాబు అద్దెకుంటున్న ఇంటి ని  కూడా కూల్చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని  ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో జగన్ చంద్రబాబుకు ఆహ్వానం పంపుతారన్న ఓ వార్త ఆసక్తి రేపుతుంది.

 

ఇంతకు జగన్ చంద్రబాబును ఎందుకోసం ఆహ్వానిస్తారు.. ? ఏ కార్యక్రమానికి రమ్మని పిలవ బోతున్నారు..?  ఈ ప్రశ్నకు సమాధానం హైదరాబాదులోని ప్రగతిభవన్ లో దొరుకుతుంది.   కృష్ణా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ కెసిఆర్, జగన్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ చర్చల్లో  వచ్చిన ప్రతిపాదనలపై ఆంధ్ర ప్రదేశ్ లోని  రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చలు జరపాలని జగన్ భావిస్తున్నారు.  అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలను కుంటున్నారు.  మరి అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని తప్పకుండా పిలుస్తారు కదా. 

 

అంటే త్వరలోనే జగన్, చంద్రబాబును ఆహ్వానిస్తారు అన్నమాట.  మరి ఈ అఖిలపక్ష సమావేశంపై తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో..  గోదావరి జలాల వినియోగంపై ఆ పార్టీ స్టాండ్ ఏమిటో..  ఇవన్నీ ముందు ముందు తేలాల్సి న  ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: