జగన్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. ఎన్ని విమర్శలు చేసినా ఇది టీడీపీ తమ్ముళ్ళు కూడా మనసావాచా నమ్ముతారు. మీ ఎమ్మెల్యేలు భద్రం బాబు గారు ఇది నా ఆన అంటూ  నిండు అసెంబ్లీ సాక్షిగా జగన్ చంద్రబాబుకు అభయం ఇచ్చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో గేట్లు తెరవను అంటూ క్లారిటీగా చెప్పేశారు. ఇక్కడే ఓ పెద్ద మెలిక పెట్టారు.


మరి ఆ మెలిక కనుక విప్పితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా వైసీపీలోకి దూకేస్తారు. తన పార్టీలోకి రావాలంటే ఉన్న ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేసి రావాలన్నది జగన్ షరతు, చిత్రమేంటంటే ఆ షరతుకు కూడా ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్ళు   సరేనంటున్నారుట. నిజంగా ఇప్పటి రాజకీయాల్లో ఇది చాలా గొప్ప విషయమే. వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అంటే తమాషా కాదు కదా. 


కానీ వైసీపీలో చేరేందుకు తమ్ముళ్ళు ఎంతలా తహతహలాడుతున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే. అయినా జగన్ ససేమిరా అంటున్నారుట. తనకు ఏ ఎమ్మెల్యే అవసరం లేదని చెప్పేస్తున్నారుట. అయితే ఆ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం జగన్ ఒకే అంటున్నట్లుగా భోగట్టా. ఆయనే  అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్. ఆయన గెలిచినా పార్టీ ఓడింది. దాంతో ఆయన అధికార వైబోగం ఎపుడూ దూరంగానే ఉంది.


ఆయన విషయంలో జగన్ సైతం మెత్తబడుతున్నట్లు టాక్. కేశవ్ మీద ఎటువంటి ఆరోపణలు లేవు. ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు. దాంతో ఆయన్ని తీసుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. తొందరలో ఆయన రాజీనామా చేస్తారని, తిరిగి వైసీపీ టికెట్ మీద గెలిచి అసెంబ్లీకి వస్తారని అంటున్నారు. ఇదే జరిగితే మొత్తం రాయలసీమలో టీడీపీకి గుండుసున్నాయే. ఇక ఆక్కడ  మిగిలేది బావ చంద్రబాబు, బావమరిది బాలయ్య మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: