మరో మారు జగన్ నాయకత్వంలో ఏపీ  అసెంబ్లీ జూలై 12  నుంచి  సమావేశమవుతోంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు. దాదాపుగా మూడు వారాల పాటు జరుగుతాయని అంటున్నారు. ఈ సమావేశాలు అతి కీలకమైనవిగా చెప్పుకోవాలి. జగన్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది కూడా.


ఈ సమావేశాలలో  ప్రధాన  ప్రతిపక్షం తెలుగుదేశం నిర్వాకాన్ని పూర్తిగా  కడిగిపారేయాలని జగన్ నిర్ణయించారు. అయిదేళ్ళ పాటు ఏపీకి చేసిన అన్యాయం, దుబారా, అన్ని విధాలుగా ఏపీకి చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా జనాలకు చెప్పాలని జగన్ సిధ్ధపడుతున్నారు.


ఏపీ రెవిన్యూ లోటు గురించి, సాగు నీటి ప్రాజెక్టుల మీద, అమరావతి రాజధాని గురించి ఇలా ప్రతీ కీలమైన విషయం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ నిర్ణయం  తీసుకున్నారట.  దీనికి సంబంధించిన తుది మెరుగులు జరుగుతున్నాయి. అన్ని వివరాలతో  సహేతుకంగానే టీడీపీ సంగతి తేల్చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. మరో మారు ప్రతిపక్ష నాయకుడిగా బాబు సభలో బిక్క మొహం వేయడం తప్ప వేరేమీ దారి లేదని వైసీపీ నేతలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: