తెలుగుదేశం నేతల కోటలు దాటే మాటలు వింటుంటే వారు భయపడుతున్నట్లే ఉంది. భయపడుతున్నారా? బెదిపిస్తున్నారా? దబాయిస్తున్నారా? ఆనేది ఇంకా అర్ధం అవాల్సి ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పధకం కదిలించినా, ఏ ప్రోజెక్ట్ లోతు చూసినా కుంభకోణాలే - కుంభకోణాల పరంపరలే గడ గడా భళ్ళున బయట పడు తుండటంతో టిడిపి నేతల మాటలలో ముఖాల్లో ఆందోళన అంతులేనంత కనిపిస్తుంది.
Image result for lokesh babu kala
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి  ఎంపిక చేసిన ముప్పై అంశాలలో విచారణకు, ఆపై న్యాయపరమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వడంతో కాని తెలుగు తమ్ముళ్ళకు ఊపిరి ఆడని, ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు  ఏర్పడు తున్నాయి. రాజకీయంగా పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియని ఆందోళన, మరో వైపు ముప్పై అంశాల్లో కుంభకోణాలు ఒక దాని తర్వాత మరొకటి బయటకు వస్తే ప్రజల్లో కాస్తో, కూస్తో ఉన్న గౌరవం నమ్మకం కరిగి పోతుందన్న భయం వారిని వెంటాడుతుంది.
Image result for lokesh babu kala
ఏ కేసు ఎవరికి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి ఉండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఒక రకంగా మాట్లాడితే, మంత్రి, ఎపి టిడిపి అద్యక్షుడు కళా వెంకట రావు మరో రకంగా చెబుతున్నారు. లోకేష్ తన తండ్రి చంద్రబాబును ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అదికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారని, అనేక విచారణలు వేసినా ఏ ఆరోపణ ఋజువుచేయలేకపోయారని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ మేకపోతు  గాంభీర్యా న్ని ప్రదర్శించారు. 


అదే తరుణంలో కళా వెంకటరావు మాత్రం ఇదంతా  జగన్ – చంద్రబాబు కక్ష సాదింపు చర్య అని ఆరోపిస్తున్నారు. ఎపిలో స్కామ్ లు జరిగాయని, తద్వారా రాష్ట్రం పరువు పోతుందని చివరకు పెట్టుబడులు పెట్టే వారు కూడా రారని దాంతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని కొత్త వాదన తెస్తున్నారు.


ఈ స్కాములన్నీ బయటకువస్తే పోయేది రాష్ట్రం పరువు కాదు, టిడిపి పరువు కాబట్టే వారు వణికి పోతున్నారు. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం గొప్ప సంచలనం కానుందా?  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ముందుగానే ₹ 2636 కోట్ల స్కామ్ జరిగిందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని అప్పటి విద్యుత్  శాఖ మంత్రి కళావెంకట్రావు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విదానాల ప్రకారమే ప్రోత్సాహాకాలు ఇవ్వడం జరిగిందని ఆయన అంటున్నారు. కళా వెంకట్రావుకు ఈ కేసు లో తాను ఎక్కడ ఇరుక్కు  పోతానో అనే భయం వణుకు ఆందోళన ఆయన ముఖంలో దైహిక భాషలో తీవ్రంగానే స్పష్టంగా కనిపిస్తుంది.


వైఎస్ జగన్ స్పష్టంగా గత ప్రభుత్వంలో ఈ స్కామ్ కు బాద్యులైన అదికారి, మంత్రి, ముఖ్యమంత్రి పై చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సహజంగానే ప్రతిపక్షం గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే విషయమే. మాట్లాడితే జగన్ పై కేసులు ఉన్నాయని టిడిపి చెప్పి తప్పించుకోవాలని చూస్తోంది. ఆయనపై ఏ సమయంలో కేసులు ఎలా పుట్టుకొచ్చాయో జగమెరిగిన సత్యమే. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రజాప్రతినిదిగా కూడా లేని వేళ పెట్టిన కేసులు అవి. పైగా ఆయన కంపెనీలలోకి పెట్టుబడులు రావడానికి, నాటి ప్రభుత్వానికి లంకెపెట్టి జగన్ ను బుక్ చేయాలనే లక్ష్యంతో  నాటి సిబిఐ అదికారులు నిర్మించినవని అందుకు వారు ఎంతగానో తంటాలు పడ్డారని అంటున్నారు. దీని నేపధ్యంలో కాంగ్రెస్, టిడిపి అగ్రనేత ల ప్రోద్బలం ఉందని అన్న సంగతి తెలిసిందే. 


వైఎస్ జగన్ ఒక దశాబ్ధకాలం పాటు ధైర్యంగా ఆ కేసులను ఎదుర్కున్నారు. అడ్డగోలుగా ఆయనను జైలులో పెట్టి వేదించినా భరించారు. జనంలోకి వెళ్ళి ఒక ఏడాది పాటు ప్రజలకు వివరించి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని స్వంతం చేసుకున్నారు. 


ఇప్పుడు టిడిపి నేతలపై వస్తున్నవి పెట్టుబడులకు సంబంధించిన ఆరోపణలు కావు. అవినీతి ఆరోపణలు. ప్రజా దనాన్ని దోచేశారన్న అబియోగాలు. యూనిట్ విద్యుత్ దర నాలుగు రూపాయలకు మించని వేళ చంద్రబాబు ప్రభుత్వం యకాయకీ ఆరు రూపాయలకు పైగా వ్యయం చేసి విద్యుత్ కొనుగోలు చేయవలసిన అవసరాన్ని బయటపెట్టినప్పుడు - కళా వెంకట రావుకు నేరుగా జవాబు ఇచ్చే పరిస్థితులు కనిపించలేదు. 


అలాగే జిఎమ్ ఆర్ విద్యుత్ సంస్థ కంటే - లాంకో ,స్పెక్ట్రం సంస్థల నుండి యూనిట్ కు నలభై పైసలు అదనంగా పెట్టి విద్యుత్ ఎందుకు కొన్నారు? తద్వారా సుమారు ₹ 270 కోట్ల మేర అదనపు చెల్లింపులు ఎందుకు చేశారు? వీటికి నిర్దిష్టంగా తగు సమాదానం చెప్పలేక,టిడిపి నేతలు ఏవేవో తల తోక లేని సమాధానాలు చెపుతున్నారు. రెండు నాలుకలతో పలురకాలుగా మాట్లాడడం టిడిపి అధినేతలకే కాదు నేతల నుండి కార్యకర్తలవరకు కొత్త విషయం మాత్రం కాదు.  చంద్రబాబు తెలుగు దేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తొలి నాళ్ళ నుండీ వారు ఇదే సిద్దాంతం అనుసరిస్తూ వస్తున్నారు.


రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా కావాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి - తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఒకసారి, ఇచ్చాక ఎందుకు ఇచ్చారని మరోసారి ఆదోళనలకు దిగడం - ఇలా అన్నింటా “డబుల్ గేమ్” పునాదులే. కొన్నిసార్లు అబద్దాలు, డబుల్-గేమ్ లు కాలంతో వారికి కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, నాయకత్వం రాజకీయంగా లబ్దిపొంది ఉండవచ్చు. కాని ప్రజలు ఎల్లవేళల మోసపోవటానికి సిద్ధంగా లేరనేది గత ఎన్నికలు ఋజువు చేశాయి. ఈ పాప పంఖిలాల ఫలితమే టిడిపి దారుణ పరాజయం పొందింది. ఆయినా ధారుణ ఓటమిని ఈవీఎం లపైకి నెట్టేయటానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు పన్నని వ్యూహంలేదు ప్రేరేపించని కుట్ర లేదు. 


ఆ తరవాత కొత్త ప్రభుత్వ హయాం నుండి వాళ్ల స్కామ్ లన్నీ ఒక్కొక్కటి పాపాల పాముల పుట్ట బ్రద్ధలై బయటకు వస్తుండడం తో ఆ పార్టీ నాయకులకు దిక్కు తోచడం లేదు. చంద్రబాబు నాయుడు గాని ఆయన తనయుడు లోకేష్ కాని చివరకు మాజీ మంత్రి కళా వెంకటరావు లేదా మరెవరికైనా వాళ్ళు తప్పు చేయలేదని భావిస్తే విచారణ కు సర్వదా సిద్దమే అని ప్రభుత్వానికి సవాల్ చేయవచ్చు కదా!  అలా నేఱుగా కాకుండా ,తమను ఏవరూ ఏమీ చేయలేరని, కొత్త ప్రభుత్వం చంద్రబాబును టిడిపి లక్ష్యంగా మొదలెట్టిన కక్ష సాదింపుచర్య అని ఇంకోసారి చెప్పి ప్రజల్ని ఎప్పటి మాదిరే గందరగోళంలో పడేయాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. 


ఈ నెల రోజుల వైఎస్ జగన్ పాలన చూశాక టిడిపివారి మన సంతా కలతల వరదలు ఎత్తుతున్నాయని చెప్పాలి. ఒక వైపు కొత్త ప్రభుత్వ లక్ష్యాలైన నవరత్నాలు అమలు చేస్తున్న తీరు, మరో వైపు స్కాములు బయటపడుతున్న తీరు - టిడిపికి క్షణమొక నరకంగా – దినదిన గండంలా ఇంకా నిజంగా చెప్పాలంటే, సైతం ఆడని దిక్కుమాలిన పరిస్థితి వారిది.


ఏది ఏమైనా లోకేష్ సవాల్ విసిరారు కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి పై మరింత బాద్యత పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, అవినీతిని, బంధు ప్రీతిని, కుల పక్షపాతాన్ని, గుత్తేదార్లకు దోచి పెట్టిన విషయాలను, అనవసర ప్రజాధన దుర్వినియోగాన్ని, తన స్వంత భయాల తో కేంద్రం అందించిన విభజన పలాలను వదిలేసిన పాపాలను - తవ్వి తీసి - వాటిని ఒక లాజికల్ క్రమంలో వెల్లడి చేసి ముగింపుకు తీసుకువెళ్ళి విచారణలు ఆపై శిక్ష లవరకు నడిపించ వలసిందే.


లేకుంటే నారా చంద్రబాబు నాయుడు నారాలోకేష్ నాయుడు వారి అనుయాయులు కుల జనులు “ఏం పీకారని? అంతా జగన్ ప్రగల్బాలేనని, ప్రభుత్వానికి అంత పస గాని ధమ్ము గాని లేవని  రెచ్చిపోయి మరీ మరీ చెలరేగి మాట్లాడే అవకాశం ఉంది"  అవినీతి గనుల లోతులుచూసి వాటి అంతు తేల్చుకో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు రెచ్చిపోవటం ఖాయం. టిడిపికి అలాంటి అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవ్వకపోవచ్చునన్నదే తెలుగు ప్రజల నమ్మకం మాత్రమే కాదు ఆకాంక్ష కూడా.  ఖచ్చితంగా టిడిపి కుంభకోణాల చరిత్ర దాని నిగ్గు ప్రజలకు చట్ట పరంగా నిరూపిస్తారని అత్యధిక జన విశ్వాసం. 

మరింత సమాచారం తెలుసుకోండి: