తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు అయిన కొత్త సెక్రటేరియట్ విష‌యంలో..ఓవైపు కోర్టు కేసులు న‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ...మ‌రోవైపు శంకుస్థాపన పూర్తి కావటంతో ఇప్పుడు శాఖల షిఫ్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైకోర్టులో కేసుల‌ను లైట్ తీసుకుంటూ...సెక్ర‌టేరియ‌ట్ త‌ర‌లింపున‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా ఏ శాఖను ఎక్కడకు తరలించాలనే దానిపై శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ శాఖ షిఫ్టింగ్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో కూడా స్పష్టం చేసింది.


స‌చివాల‌యం కూల‌గొట్ట‌డంతో భాగంగా ఉన్న కేంద్రాల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం ప్రతి శాఖకు నోడల్ అధికారులను నియమించింది. సచివాలయంలో శాఖల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులను షిఫ్ట్ చేసిన తర్వాత కొత్త  కార్యాలయంలో ఎంత స్పేస్ అవసరముంటుందో అంచనా వేసింది. శాఖల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను పేర్కొంది. షిఫ్ట్ చేసిన తర్వాత ఎంత స్పేస్ అవసరమన్న దానిపై అన్ని శాఖలను వివరణ కోరింది. ప్రస్తుత సచివాలయం కూల్చివేత జులై 31లోగా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.



ఒక్కో ఉద్యోగికి 200 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉదాహరణకు 60 మంది ఉద్యోగులు ఉంటే 12 వేల చదరపు అడుగుల స్థలం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో షిఫ్టింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారనే దానిపై సోమవారం నుంచి అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. ఏ శాఖ ఎంత స్పేస్ ఉపయోగించుకుంటోంది, కొత్త ప్లేస్ కు వెళ్తే ఎంత ప్లేస్ అవసరం ఉంటుందన్న దానిపై నివేదికలు తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. సచివాలయం తరలింపుపై రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉన్నారు. త్వరలో ఈ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 


ఏ శాఖ ఎక్కడకు వెళ్తోందంటే…
హోంశాఖ- బీఆర్‌కే భవన్‌
హౌసింగ్‌- హిమాయత్‌నగర్‌
ఆర్థిక- బీఆర్‌కే భవన్‌
సివిల్‌ సప్లయిస్‌- ఎర్రమంజిల్‌
అటవీ-అరణ్యభవన్‌
బీసీ వెల్ఫేర్‌-సంక్షేమభవన్‌
ఉన్నతవిద్య-ఎస్‌సీఆర్టీ
విద్యుత్‌- విద్యుత్‌ సౌధ
ఇండస్ట్రీస్‌- ఎస్‌ఎఫ్‌సీ భవన్‌
రెవెన్యూ-రిజిస్ట్రేషన్ల శాఖ భవనానికి తరలించనున్నారు.
షిఫ్టింగ్ ఖరారు కాని శాఖలు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జీఏడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, మెనార్టీ సంక్షేమం, ఐటీ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, యువజన సర్వీసుల శాఖ.


మరింత సమాచారం తెలుసుకోండి: