విశాఖ నగరం 19వ వార్డులో 2000 గజాల స్థలంలో ఉన్న తెదేపా కార్యాలయానికి జీవీఎంసీ జోన్‌-3 ప్రణాళికాధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణానికి సంబంధించి ప్లాను మంజూరు చేయడానికి 2016లో దరఖాస్తు చేశారని, స్థలం రాణీ కమలాదేవి నుంచి తెదేపా కార్యాలయానికి దఖలు పడిన దస్త్రాలను అందజేయలేదని నోటీసులో పేర్కొన్నారు.

 

దీంతో ప్లాను మంజూరు చేయలేదని, లింకు డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. 1955 హైదరాబాద్‌ మున్సిపల్‌ చట్టం 452 ప్రకారం.. నోటీసులు జారీ చేసిన వారంలోగా సమాధానం ఇవ్వకపోతే, అక్రమ భవనంగా గుర్తించి కూల్చివేస్తామని, అందుకయ్యే ఖర్చును సైతం భరించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులను తెదేపా నగర అధ్యక్షుడి పేరుమీద జారీచేశారు.

 

తెదేపా కార్యాలయం కోసం 1991లో లీజు ప్రాతిపదికన రెవెన్యూశాఖ స్థలం కేటాయించింది. రెవెన్యూ శాఖ లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలం కేటాయిస్తే డాక్యుమెంట్లు ఎలా వస్తాయి? ఇంత వరకూ ఈ స్థలం రాణి కమలాదేవికి చెందినదిగా మాకు తెలియదు. దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ పరంగా చర్చించి, తదుపరి జీవీఎంసీ కమిషనర్‌ను కలుస్తాం.

 

అయితే, ఈ విషయంలో జగన్..ఎవరిపైనో కక్ష తీర్చుకోవడానికో, ద్వేషంతోనో గత ప్రభుత్వ అవినీతి, అవకతవకలపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాలవల్ల జరిగిన అవినీతిని నిరోధించి ప్రజాధనాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: