మెగా డాటర్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఎప్పుడు స్కిన్ షోకు దూరంగా ఉంటుంది. అయితే బాలీవుడ్ లో ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన స్టార్ కిడ్స్ గ్లామరస్ పోజులు ఇవ్వడం..  తమ హాట్ నెస్ తో సోషల్ మీడియా షేక్ అయ్యేలా చెయ్యడం చాలా కామన్.  అదే టాలీవుడ్ కు వచ్చేసరికి స్టార్ కిడ్స్ ఇంకా అంత దూరం పోలేదు.  గ్లామర్ కు అయినా.. హాట్ షోలకు అయినా ఒక లిమిట్ మెయింటెయిన్ చేస్తారు.


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక కొణిదెల అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ప్రతి దానికి ఏదో ఒక ఫస్ట్ టైమ్ ఉంటుంది అన్నట్టుగా తన ఇన్స్టా ఖాతా నుంచి తాజాగా ఒక గ్లామరస్ ఫోటో పోస్ట్ చేసింది.  వైజాగ్ బీచ్ లో చిల్ అవుట్ అవుతూ ఉన్న సమయంలో నిహారిక తన అమ్మగారితో  తీయించుకున్న ఫోటో ఇది.  ఈ ఫోటోకు "బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 


ఈ ఫోటో లో పొడవాటి వైట్ షర్టు ధరించిన నిహారిక ప్యాంట్ ఏమీ వేసుకోలేదు.  ఆరెంజ్ షార్ట్ వేసుకుంది.  అయితే ఫోటో మాత్రం మెగా హాట్ గా ఉంది.  ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి.  "సో క్యూట్ నిహారిక".."చూడు పూర్తిగా రకుల్ గా మారిన నిహారికను చూడు".. "వరుణ్ తేజ్ షర్టు వేసుకున్నావా?" అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోను చూసిన కొంతమంది మెగాఫ్యాన్స్ చిర్రుబుర్రులాడారు. "మీరు మెగా ఫ్యామిలీ లో పుట్టారు.. కొంచెం గౌరవంగా ఉండడం నేర్చుకోండి.. ఇలా స్కిన్ షో చెయ్యవద్దు" అంటూ కామెంట్ పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: