అనంతపురం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి పలువురు నేతలు డుమ్మా కొట్టడం హాట్ టాఫిక్ గా మారింది . వీరంతా పక్క పార్టీల వైపు ఏమైనా చూస్తున్నారా ? అన్న చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది . పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి గైర్హాజరు అయిన వారిలో కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా  విన్పిస్తున్నాయి . ఈ నేపధ్యం లో సమన్వయ కమిటీ సమావేశానికి వారు డుమ్మా కొట్టడం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.


ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన జేసీ సోదరుల కుమారులు జేసీ పవన్ రెడ్డి , అస్మిత్ రెడ్డి లు , జేసీ సోదరులు ఈ సమావేశానికి దూరంగా ఉండగా , హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప , ప్రభాకర్ చౌదరి  తదితరులు సైతం సమావేశానికి హాజరుకాకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది .    బీజేపీ లో చేరాలని తమకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఇటీవల జేసీ సోదరులలో ఒకరైన దివాకర్ రెడ్డి పేర్కొన్న విషయం తెల్సిందే . జేసీ పవన్ రెడ్డి , అస్మిత్ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు దృష్టి లో పెట్టుకుని , జేసీ సోదరులు బీజేపీ లో చేరే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .


 జేసీ సోదరుల గైర్హాజరై కంటే హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప , అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  అయితే అనంత జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీ లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది . వారిలో కిష్టప్ప , ప్రభాకర్ చౌదరి కూడా ఉన్నారా ? అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.  దానికి తోడు పార్టీ కార్యక్రమాల పట్ల కొంతమంది తమ్ముళ్లు అంటి , ముట్టనట్లు వ్యవహరిస్తుండడం తో ఎప్పుడు, ఎవరు పక్క పార్టీలో చేరుతారోనన్న  అనుమానాలు టీడీపీ నాయకత్వాన్ని ఉక్కిరి , బిక్కిరి చేస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: