దేశంలోని 6 మహానగరాల్లో కాలుష్యకోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో పాటు ఫ్యాక్టరీల నుంచి వాయుకాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యంతో స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  నగరాల్లో ఉండే మనిషి ఆయుర్ధాయం సగటు క్రమేణా తగ్గిపోతున్నది.  


దీని నుంచి బయటపడటానికి జనం ప్రకృతివైపు పరుగులు తీస్తున్నారు.  సమయం దొరికితే హిల్ స్టేషన్స్ కు వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సమ్మర్ వచ్చింది అంటే ప్రజలంతా నిత్యం తిరుపతి తిరుమల వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు. 


ఒక్క సమ్మర్లోనే కాదు.. నిత్యం తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నది.  దీంతో కాలుష్యం దారుణంగా పెరిగిపోతున్నది.  రోజు వేలాది వాహనాలు తిరుమలకు వెళ్తున్నాయి.  1500 బస్సులు వేలాది ప్రయివేట్ వాహనాలు తిరుమల వెళ్లి వస్తుంటాయి.  దీంతో తిరుమల వాయువుల్లో కాలుష్యం ఏర్పడింది.  


హైదరాబాద్ నగరంలోని గాల్లో ఉన్న విషవాయువుల కంటే.. తిరుమల కొండల్లో ఉన్న గాలిలో విషవాయువులు అధికంగా ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి.  దీనిని వీలైనంతగా తగ్గించేందుకు వాతావరణ సంస్థ కృషి చేస్తున్నది. ఒకవేళ ఈ కాలుష్యాన్ని అలానే వదిలిస్తే.. తిరుమల కొండల్లో ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: