2019 లో ఎన్నికలు ముగిశాయి.  ఈ ఎన్నికల్లో వైకాపా 151 స్థానాల్లో విజయం సాధించింది.  జగన్ అధికారంలోకి వచ్చాక పరిపాలన విషయంలో స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.  


అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పథకం అమలుకు సంబంధించిన దానిపై సంతకం పెట్టారు.  అమ్మఒడి పధకం కింద 15 వేల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు.   రైతు భరోసా పధకం కింద రైతులకు 50వేల రూపాయల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.  


నవరత్నాలను జగన్ అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చు.  అయితే, ఇప్పుడు కేంద్ర జమిలి ఎన్నికలు అనే కొత్త విషయాన్ని తెరమీదకు తీసుకొస్తోంది.  దీనిపై కమిటీలను కూడా వేస్తున్నది.  జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు ఒప్పుకుంటే 2024 లో జరగాల్సిన ఎన్నికలు 2023 లో జరిగే అవకాశం ఉంది.  


ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలులోకి వస్తాయి.  ఇది జగన్ కు కొంత ఇబ్బంది కలిగించే అంశమే.  ప్రతిపక్షంలో ఉన్న టిడిపికి దీనివలన పెద్దగా ఉపయోగం ఉండదు.  కానీ, జనసేన గ్రామాల్లో బలపడితే కొంతమేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: