- గడువు పొడిగించిన మద్యందుకాణాల పర్మిట్ రూములు రద్దుచేయాలని డిమాండ్‌
గడువు పొడిగించిన మద్యం షాపుల పర్మిట్ రూములు రద్దుచేయాలని,మద్యం తాగి వాహనాలు నడిపే వారిపే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు లు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేపట్టాలని ఏ పి మద్య నిషేధ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆధ్వర్యాన ప్రతినిధిబృందం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. 


గత ప్రభుత్వం అధికఆదాయాల కోసం ఎక్సైజ్ శాఖను ప్రోత్సహించి మద్యం షాపులకు ఇష్టారాజ్యంగా పర్మిట్ రూములు అనుమతిం చారని ఇవి  బహిరంగ మద్యపాన మైదానాలుగా మారి  అసాంఘికవాతావరణం సృష్టిస్తున్నాయని తెలిపారు. సంసారపక్షంగా జీవించే మహిళలు  గత్యంతరం లేకఆయా ప్రాంగణాలముంగిటనుండి మసలుకోవాల్సిన దుస్తితి తీవ్రంగా తయారయ్యింద న్నారు. 


చిన్నపిల్లలు అదేమిటమ్మా అని అంటే ఏమిచెప్పాలో అర్ధం కాని  అయోమయం ఏర్పడిందన్నారు. పార్కులు ప్రభుత్వ పాఠశాలలు బస్ స్టాండ్ రైల్వేస్టేషన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీల దిగువన వివిధషాపుల్లోనూ అర్ధరాత్రివరకు మద్యంసేవించే ఆకతాయిల బెడద విపరీతంగా తయారయ్యిందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు లు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేపట్టే చర్యలు జిల్లా కేంద్రం లో అమలు చేయాలని కోరారు. 


మద్యం షాపులకు మూడునెలల గడువు పొడిగించిన నూతన ప్రభుత్వం దశల వారీ మద్యనిషేద అమలుకోసం పర్మిట్ రూములకు నిర్ధిష్ట కొలతలు ప్రకటించి నిర్వహింపజేయించా లని ఇస్టారాజ్యంగా కొనసాగుతున్న పర్మిట్ రూములు తక్షణమే రద్దుచేయాలని మద్యనిషేధ పోరాట సమితి వినతిపత్రం లో తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: