దాదాపు చంద్రబాబుతో పాటు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. టిడిపిలో దశాబ్దాలుగా కీలక నేతగా ఉన్న ఆయన గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పేరుకు చంద్రబాబు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా.. కనీసం తన శాఖలో కూడా ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు తన చిరకాల రాజకీయ శత్రువు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టిడిపిలో చేర్చుకునేందుకు అలిగి చంద్రబాబుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు..


ఈ ఎన్నిక‌ల్లో తాను పోటీ నుంచి త‌ప్పుకుని తన కుమారుడు కేఈ.శ్యాంబాబు, తన సోదరుడు కేఈ.ప్ర‌తాప్‌ను పోటీ చేయించ‌గా ఈ ఇద్దరు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఇక‌ ఇప్పుడు టిడిపిలో ఉంటే రాజకీయ త‌మ కుటుంబానికి రాజ‌కీయ భవిష్యత్తు లేదన్న క్లారిటీ కేఈకి వచ్చేసిందట. కర్నూలు జిల్లాలో తమకు రాజకీయంగా ఉన్న కోట్ల ఫ్యామిలీతో చేతులు కలప‌డం... జిల్లాలో ఉన్న తమ వర్గం నేతలు కూడా జీర్ణించుకోలేక పోయారు అన్న విషయం ఎన్నికల్లో ఓడిపోయాక కానీ కేఈకి అర్థమైనట్టు లేదు.


బీసీల్లో బలమైన నేతగా ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు నేతలు ఓడిపోవడంతో టిడిపిపై వ్యతిరేకత కారణమని వాళ్ల అనుచ‌రులు భావిస్తున్నారు. 2009లో రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బలంగా వీచిన కాంగ్రెస్ గాలులను తట్టుకుని కూడా కర్నూలు జిల్లాలో కేఈ సోదరులు ఇద్దరు ఘన విజయం సాధించారు. అలాంటి నేతలు ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేఈ ఫ్యామిలీపై వ్య‌తిరేక‌త కంటే టిడిపిపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కారణం అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.


ఈ క్రమంలోనే ఇప్పుడు వీరి చూపు బిజెపి వైపు మళ్ళింది అని తెలుస్తోంది. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు కూడా ఈ ఫ్యామిలీని వెంటాడుతోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరితే తమకు రక్షణ ఉంటుందని స్థానికంగా ఉన్న రాజకీయాల నుంచి తమకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ ఫ్యామిలీ భావిస్తోందట . వీళ్లు టీడీపీ వీడితే కర్నూలు జిల్లాలో టిడిపి పని అయిపోయినట్టే. ట్విస్ట్ ఏంటంటే టీడీపీ నుంచి ఓడిపోయినా కోట్ల ఫ్యామిలీ చూపు సైతం బిజెపి వైపు ఉందట. టిడిపిలో ఇమ‌డ‌లేక‌పోయిన ఈ రెండు వైరి వ‌ర్గాలు రేపు బిజెపి లో చేరితే ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: